Telugu Global
Cinema & Entertainment

Ahimsa - మరోసారి వాయిదాపడిన అహింస

Ahimsa Movie - అభిరామ్ దగ్గుబాటి హీరోగా పరిచయమౌతున్న అహింస సినిమా, నెలకోసారి వాయిదా పడుతోంది. తాజాగా మరోసారి వాయిదా పడింది.

Ahimsa - మరోసారి వాయిదాపడిన అహింస
X

తేజ డైరక్ట్ చేసిన తాజా చిత్రం అహింస. సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ దగ్గుబాటి ఈ సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. కానీ మార్కెట్ మాత్రం జరగడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు ఈ మూవీ వాయిదాల బాట పడుతోంది. తాజాగా మరోసారి వాయిదా పడింది.

ఈ నెలలో కచ్చితంగా ఈ సినిమాను విడుదల చేస్తారని అనుకున్నారు. అనధికారికంగా తేదీ కూడా వెల్లడించారు. కానీ ఈ నెలలో అహింస థియేటర్లలోకి రావడం లేదు. జూన్ 2న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ తేదీకైనా సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలామంది.

ఎందుకుంటే, ఈ సినిమాను ప్రతి నెల వాయిదా వేస్తున్నారు. దాదాపు ఫిబ్రవరి నుంచి ఇదే వ్యవహారం నడుస్తోంది. కనీసం నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినా సినిమా రిలీజ్ అయ్యేది, అది కూడా జరగలేదు.

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నాడు. గీతిక హీరోయిన్ గా పరిచయమౌతోంది.

First Published:  12 May 2023 6:38 PM IST
Next Story