Telugu Global
Cinema & Entertainment

Top Gear: ఒక్క రోజులో జరిగే కథ

Top gear movie: ఆది సాయికుమార్ మరో మూవీతో రెడీ అయ్యాడు. ఈసారి టాప్ గేర్ వేశాను అంటున్నాడు. సినిమా థీమ్ గురించి చెబుతున్నాడు.

Top Gear: ఒక్క రోజులో జరిగే కథ
X

ఈ ఇయర్ ఎండింగ్ కు మరో సినిమా రెడీ చేశాడు ఆది సాయికుమార్. ఇప్పటికే చాలా సినిమాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ హీరో, ఇప్పుడు టాప్ గేర్ అనే సినిమాతో ప్రేక్షకులముందుకొస్తున్నాడు. ఈ సినిమా ఐడియా తనకు బాగా నచ్చిందని, అందుకే ఒప్పుకున్నానని అంటున్నాడు.


"టాప్ గేర్ కథ నాకు బాగా నచ్చింది. క్యాబ్ డ్రైవర్‌.. అతని జీవితంలో చిన్న సమస్య.. అది పెద్దగా మారడం.. ఒక్క రోజులో ఈ కథ జరుగుతుంది.. మా టీం అందరికీ ఈ కథ నచ్చింది. అందుకే ఈ సినిమాను చేశాం. టాప్ గేర్ అనేది కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏమీ కాదు. ఓ కుర్రాడు తనకు సంబంధం లేని చిక్కుల్లో ఇరుక్కుంటే ఏం అవుతుంది.. దాన్నుంచి ఎలా బయటపడతాడు అనేది చూపిస్తాం. ఐడియా కొత్తగా ఉంటే నేను సినిమాలను ఎంచుకుంటాను. ఐడియా బాగుంటే సగం సినిమా హిట్ అయినట్టే. మిగతాది అంతా స్క్రీన్ ప్లేలో ఉంటుంది."


వరుసగా ఫెయిల్యూర్స్ చూస్తున్న ఈ హీరో, వాటిపై కూడా స్పందించాడు. జనాలకు ఏది నచ్చుతుందో అంచనా వేయలేకపోతున్నామన్నాడు. అందుకే మనసుకు నచ్చిన కథను చేసుకుంటూ వెళ్తే, ఏదో ఒక టైమ్ లో ప్రేక్షకులు ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

First Published:  28 Dec 2022 8:32 PM IST
Next Story