Telugu Global
Cinema & Entertainment

రచ్చ రేపుతున్న మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం

కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయి.. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని మంచు విష్ణు అన్నారు.

రచ్చ రేపుతున్న మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం
X

మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం రచ్చ రేపుతోంది. తండ్రికొడుకులు మోహన్‌బాబు, మంచు మనోజ్ ఒక‌రిపై ఒక‌రు పోలీసుల‌కు కంప్లెంట్ చేశారు. దాంతో మంచు మ‌నోజ్‌, మంచు మోహ‌న్‌బాబు నుంచి ఫిర్యాదులు స్వీక‌రించిన ప‌హాడిష‌రీఫ్ పోలీసులు మంగ‌ళ‌వారం రెండు కేసులు న‌మోదు చేశారు మోహ‌న్‌బాబు ఫిర్యాదుతో మంచు మ‌నోజ్‌, అత‌ని భార్య భూమా మౌనికపై 329, 351 సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేశారు. నా కొడుకు నుండి నాకు ప్రాణహాని ఉంది నన్ను రక్షించండి అంటూ రాచకొండ సిపికి మోహన్ బాబు లేఖ రాశారు. ఇవాళ ఉద‌యం మంచు విష్ణు దుబాయి నుంచి హైద‌రాబాద్ చేరుకున్నారు. జ‌ల్‌ప‌ల్లిలోని ఇంటికి వెళ్లే మార్గ‌మ‌ధ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

త‌మ కుటుంబంలో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు త‌లెత్తాయ‌ని, త్వ‌ర‌లోనే అన్నీ ప‌రిష్కారం అవుతాయ‌ని విష్ణు అన్నారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్ద‌గా చిత్రీక‌రించ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న తెలిపారు. అయితే, ఈ గొడవలన్నీమోహన్ బాబు జల్ పల్లిలో నిర్మించుకున్న విశాలమైన ఇంటి కోసమే అని జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లగా ఆ ఇంటి నుంచి తన కుటుంబంతో దూరంగానే ఉంటున్నామని, తన ముందే తన కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులను తీవ్రంగా తిట్టారని, ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమయ్యాయని, అన్న విష్ణు దుబాయ్‌కు ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసునని అన్నారు. విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు.

First Published:  10 Dec 2024 11:59 AM IST
Next Story