Telugu Global
Cinema & Entertainment

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు వెనుక భారీ కుట్ర?

దేవర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు వెనుక తెలంగాణ ప్రభుత్వం కుట్ర ఉందని తెలుస్తోంది. నిన్న రాత్రి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఘనంగా నోవాటెల్ హొటల్‌లో జరుపుకోవడానికి మూవీ యూనిట్ సర్వ సిద్దం అయింది.

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు వెనుక భారీ కుట్ర?
X

దేవర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు వెనుక తెలంగాణ ప్రభుత్వం కుట్ర ఉందని తెలుస్తోంది. నిన్న రాత్రి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఘనంగా నోవాటెల్ హొటల్‌లో జరుపుకోవడానికి మూవీ యూనిట్ సర్వ సిద్దం అయింది. అయితే ప్రీ రిలీజ్ పంక్షన్ ఆగిపోవడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. దేవర మూవీ ప్రీ రిలీజ్‌కు 10,000 మందిని ఆహ్వానించారు. కానీ అధిక సంఖ్యలో 20,000 నుంచి 30,000 మంది ఎన్టీఆర్ అభిమానులు వచ్చారు. పది వేల మంది సంబంధించి ఫ్యాన్స్‌కు బందోబస్తు కల్పించాలి కానీ అదే సీఎం రేవంత్ అధ్యక్షతన మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్లో సీఎల్పీ సమావేశం జరగటంతో పోలీసులు మొత్తం రక్షణ కల్పించారు. దీంతో దేవర సినిమా ప్రీ రిలీజ్ బందోబస్తు కల్పించలేమని తెలంగాణ పోలీసులు తెల్చిచెప్పారు.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరుత్సహాన్నికి గురియ్యారు. ముఖ్యమంత్రి మీటింగ్ కారణంగా ప్రీ రిలీజ్ రద్దు అయినట్లు తెలుస్తోంది. అయితే సీఎం ప్రోగ్రాం ముగించుకొని పోలీసులు మళ్ళీ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే నోవాటెల్ హోటల్ కి వచ్చేలోపే ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి కుర్చీలు, కట్టెలు విరిగిపోయాయి ఇక అలాంటి సమయంలో ఈవెంట్ ని క్యాన్సిల్ చేసుకోవడమే మంచిది అని చిత్ర యూనిట్ అనుకున్నారట. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్షమాపణాలు చెప్పారు. మూవీ విడుదలకు నాలుగు రోజుల ముందు ఈ విధంగా జరగటం ఫ్యాన్స్ ని కలవరం పెడుతుంది. ఈ శుక్రవారమే సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. దేవర సినిమా టికెట్ల బుకింగ్ కర్ణాటకలోని బెంగళూరులో నేడు (సెప్టెంబర్ 26) షూరు అయింది. క్రేజ్ స్పష్టంగా కనిపించింది. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ జంటగా వస్తున్న మూవీ.

First Published:  23 Sept 2024 6:30 PM IST
Next Story