Telugu Global
Cinema & Entertainment

గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల చేయకపోతే సూసైడ్ చేసుకుంటానన్న అభిమాని

గేమ్ ఛేంజర్ ట్రైల‌ర్ విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మెగా హీరో రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్ రాయడం కలకలం రేపింది.

గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల చేయకపోతే సూసైడ్  చేసుకుంటానన్న అభిమాని
X

గేమ్ ఛేంజర్ ట్రైల‌ర్ విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మెగా హీరో రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్ రాయడం కలకలం రేపింది. త్వరలో గేమ్ ఛేంజర్ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేయాలని లేదంటే సూసైడ్ చేసుకుంటానని లెటర్‌లో పేర్కొన్నారు. సినిమా విడుదలకు ఇంకా 13 రోజులే ఉంది. ఫ్యాన్స్ ఎమోషన్స్‌ను పట్టించుకోవడం లేదని జనవరి1 వరుకు విడుదల చేయకపోతే నేను బలవన్మరణానికి పాల్పడ్డాడు ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. పుష్ప సినిమాకి ఉన్న భారీ క్రేజ్ మెల్లగా తగ్గుతూ, ఇప్పుడు అందరి దృష్టి 'గేమ్ ఛేంజర్' మీదికి వెళ్లింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటివరకు మేకర్స్ సినిమా ట్రైలర్ విడుదల చేయకపోవడంతో అభిమానుల మధ్య నిరాశ చోటు చేసుకుంది. ఇప్పటికే 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి మూడు పాటలు, టీజర్ విడుదలైంది.

First Published:  28 Dec 2024 6:30 PM IST
Next Story