అల్లు అర్జున్ పై కేసు నమోదు.. డబ్బుల మీదే తప్ప, ఫ్యాన్స్ మీద ధ్యాస లేదు
ఆర్టీసీ క్రాస్‌రోడ్ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో హీరో హీరో అల్లు అర్జున్‌పై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో హీరో హీరో అల్లు అర్జున్‌పై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. 105,118(1)r/w3(5) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంష్ యాదవ్ తెలిపారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పుష్పా 2 సినిమా యూనిట్ , హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటి వింగ్ పై కేసు నమోదు చేశారు. బన్నీ, సుకుమార్‌లపై చిక్కడ్‌పల్లి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ ఛైర్మన్ తిరుపతి వర్మ ఫిర్యాదు చేశారు.అల్లు అర్జున్‌కు డబ్బుల మీదే తప్ప, ఫ్యాన్స్ మీద ధ్యాస లేదని.. అభిమాని మరణంపై అల్లు అర్జున్ స్పందించకపోవడం దౌర్భాగ్యమని తిరుపతి వర్మ ఆరొపించారు.నిన్న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన ఘటనలో అల్లు అర్జున్ టీంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. పుష్ప-2 బెనిఫిట్ షో నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.