ఆస్కార్స్ కి ‘ఒపెన్ హైమర్’ 13 నామినేషన్లు!
‘ఒపెన్‌హైమర్’ అత్యధికంగా 13 నామినేషన్లు పొందింది.
2024 ఆస్కార్ అకాడమీ అవార్డులకు నామినేషన్ల ప్రకటన వెలువడింది. నామినీల లిస్టులో ఇద్దరు ప్రముఖులు మిస్సయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన ‘బార్బీ’ నటి మార్గోట్ రాబీ, దర్శకురాలు గ్రేటా గెర్విగ్ ఇద్దరికీ నామినేషన్లు దక్కక పోవడం పెద్ద వార్త అయింది. అంతేకాదు, ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ నటుడు లియోనార్డో డికాప్రియో కి కూడా ఆశించిన ఉత్తమ నటుడిగా నామినేషన్ దక్కలేదు. ఇతర విభాగాల్లో 10 నామినేషన్లు దక్కాయి. ‘ఒపెన్‌హైమర్’ అత్యధికంగా 13 నామినేషన్లు పొందింది. డికాప్రియోకి దక్కని నామినేషన్ సహనటి లిల్లీ గ్లాడ్‌స్టోన్ కి దక్కింది.
‘ఒపెన్ హైమర్’ ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీ, ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ సహాయ నటిగా ఎమిలీ బ్లంట్ నామినేషన్లు గెలుచుకున్నారు. ఆస్కార్ నామినేషన్లను నటులు జాజీ బీట్జ్, జాక్ క్వాయిడ్ ప్రకటించారు. జిమ్మీ కిమ్మెల్ హోస్ట్ గా తిరిగి రావడంతో మార్చి 10న (మన దేశంలో మార్చి 11 ఉదయం) లాస్ ఏంజెల్స్ లో అవార్డు వేడుక జరుగుతుంది. ఈ సంవత్సరం ఆస్కార్ నామినీల లిస్టు ఈ కింద చూద్దాం :
ఉత్తమ చలన చిత్రం: ఒపెన్ హైమర్, బార్బీ, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, పూర్ థింగ్స్, హోల్డోవర్స్, అమెరికన్ ఫిక్షన్, మాస్ట్రో, గత జీవితాలు, ఆసక్తి జోన్, అనాటమీ ఆఫ్ ఏ ఫాల్.
ఉత్తమ దర్శకుడు: క్రిస్టఫర్ నోలన్ (ఒపెన్‌హీమర్ ), మార్టిన్ స్కోర్సెసీ ( కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ ), యోర్గోస్ లాంటిమోస్ ( పూర్ థింగ్ ), జోనాథన్ గ్లేజర్ ( జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ), జస్టిన్ ట్రైట్ ( అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ )
ఉత్తమ నటి: లిల్లీ గ్లాడ్‌స్టోన్ ( కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ ), ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్), కారీ ములిగన్ ( మాస్ట్రో ), సాండ్రా హుల్లర్ ( అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ ), అన్నెట్ బెనింగ్ ( న్యాద్ )
ఉత్తమ నటుడు: సిలియన్ మర్ఫీ ( ఒపెన్‌హైమర్ ), బ్రాడ్లీ కూపర్ ( మాస్ట్రో ), జెఫ్రీ రైట్ ( అమెరికన్ ఫిక్షన్ ), పాల్ గియామట్టి ( ది హోల్డోవర్స్ ), కోల్మన్ డొమింగో ( రస్టిన్ )
ఉత్తమ సహాయ నటి: డావిన్ జాయ్ రాండోల్ఫ్ ( ది హోల్డోవర్స్ ), ఎమిలీ బ్లంట్ ( ఒపెన్‌హైమర్ ), జోడీ ఫోస్టర్ ( న్యాద్ ), అమెరికా ఫెర్రెరా ( బార్బీ ), డేనియల్ బ్రూక్స్ ( ది కలర్ పర్పుల్ )
ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ ( ఒపెన్‌హైమర్ ), ర్యాన్ గోస్లింగ్ ( బార్బీ ), రాబర్ట్ డి నీరో ( కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ ), స్టెర్లింగ్ కె బ్రౌన్ ( అమెరికన్ ఫిక్షన్ ), మార్క్ రుఫెలో (పూర్ థింగ్స్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: అనాటమీ ఆఫ్ ఎ ఫాల్, హోల్డోవర్స్, మాస్ట్రో, మే డిసెంబర్, పాస్ట్ లైవ్స్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: అమెరికన్ ఫిక్షన్, బార్బీ, ఒపెన్‌హైమర్, పూర్ థింగ్స్, జోన్ ఆఫ్ ఇంటరెస్ట్
ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం: లో కాపిటానో (ఇటలీ), పర్ఫెక్ట్ డేస్ (జపాన్), సొసైటీ ఆఫ్ ది స్నో (స్పెయిన్), టీచర్స్ లాంజ్ (జర్మనీ), జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ (బ్రిటన్) ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ : టు కిల్ ఏ టైగర్, బోబీ వైన్: పీపుల్స్ ప్రెసిడెంట్, ఫోర్ దాటర్స్, ఎటర్నల్ మెమరీ, 20 డేస్ ఇన్ మారియుపోల్
ఉత్తమ సంగీతం: అమెరికన్ ఫిక్షన్, ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ, ఓపెన్‌హైమర్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, పూర్ థింగ్స్
ఉత్తమ ఛాయాగ్రహణం: ఎల్ కొండే, మాస్ట్రో, ఒపెన్‌హైమర్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, పూర్ థింగ్స్
ఉత్తమ ఎడిటింగ్: అనాటమీ ఆఫ్ ఏ ఫాల్, హోల్డోవర్స్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, ఒపెన్‌హైమర్, పూర్ థింగ్స్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ ఒన్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూం 3, మిషన్: ఇంపాసిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ వన్, నెపోలియన్