Telugu Global
Cinema & Entertainment

నెట్ ఫ్లిక్స్ లో 20 క్రిస్మస్ కామెడీ సినిమాలు!

ఈ నేపథ్యంలో 2023 క్రిస్మస్ కి నెట్ ఫ్లిక్స్ 20 క్రిస్మస్ సినిమాల్ని స్త్రీమింగ్ చేస్తోంది అవేమిటో తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో 20 క్రిస్మస్ కామెడీ సినిమాలు!
X

ఒకప్పుడు క్రిస్మస్ కి తెలుగు ఛానెల్స్ లో ‘కరుణామయుడు’, ‘రాజాధి రాజు’ అనే రెండు ఏసుక్రీస్తు భక్తి సినిమాలు ప్రసారమయ్యేవి. తర్వాత అవి కనుమరుగయ్యాయి. ఏసుక్రీస్తు మీద కొత్తగా తెలుగు సినిమాలు తీయలేదు. కానీ హాలీవుడ్లో మన సంక్రాంతికి తెలుగు సినిమాల్లాగా క్రిస్మస్ సీజన్ కోసం ఏడాది మొదట్లోనే అనేక సినిమాల నిర్మాణం ప్రారంభిస్తారు. ఏడాది చివర నవంబర్, డిసెంబర్ మాసాల్లో విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో 2023 క్రిస్మస్ కి నెట్ ఫ్లిక్స్ 20 క్రిస్మస్ సినిమాల్ని స్త్రీమింగ్ చేస్తోంది అవేమిటో తెలుసుకుందాం...

1 ది ఆర్చీస్ : ఈ నెట్ ఫ్లిక్స్ మూవీ జోయా అక్తర్ దర్శకత్వంలో డిసెంబర్ 7న విడుదలైంది. అమెరికన్ ఆర్చీ కామిక్స్ కి భారతీయ సంగీత అనుసరణ అయిన ఈ మూవీ ఆంగ్లో- ఇండియన్ కథలో అగస్త్య నంద, సుహానా ఖాన్, ఖుషీ కపూర్, వేదాంగ్ రైనా నటించారు. పూర్తిగా టీనేజర్స్ ఎంటర్ టైనర్ ఇది.

2. బెస్ట్ క్రిస్మస్ ఎవర్ : ఈ మేరీ లాంబెర్ట్ కొత్త కామెడీలో క్రిస్మస్ ని ఒక పోటీ క్రీడలా జరుపుకుంటారు. హాస్యంతో గందరగోళాన్ని సృష్టించే కథ ఇది.

3. ఫ్యామిలీ స్విచ్ : జెన్నిఫర్ గార్నర్, ఎడ్ హెల్మ్స్ ముగ్గురు పిల్లల తల్లిదండ్రులుగా నటించిన ఈ క్రిస్మస్ కామెడీలో ఒకరి స్థానంలో మరొకరు ప్రవేశించి గలాభా సృష్టిస్తారు.

4. లెట్ ఇట్ స్నో: ఈ టీన్ రోమాంటిక్ కామెడీ మంచు కురుస్తున్న క్రిస్మస్ పండుగ వాతావరణంలో టీనేజర్ల శృంగార కుతంత్రాలతో వుంటుంది.

5. ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ : ఈ రోమ్-కామ్‌లో ఓ స్కీయింగ్ ప్రమాదం తర్వాత జ్ఞాపకశక్తిని కోల్పోయిన బ్రాటీ వారసురాలిగా ఫ్రీకీ ఫ్రైడే నటించింది.

6. స్క్రూజ్ : ఏ క్రిస్మస్ కరోల్ : చార్లెస్ డికెన్స్ ఐకానిక్ క్రిస్మస్ ఘోస్ట్ స్టోరీకి నెట్‌ఫ్లిక్స్ అనుసరణ ఇది.

7. వైట్ క్రిస్మస్ : ఇద్దరు సెలబ్రిటీ ఎంటర్‌టైనర్‌లు (బింగ్ క్రాస్బీ, డానీ కే) వారి మాజీ కమాండింగ్ ఆఫీసర్ యాజమాన్యంలోని ఖాళీగా వున్న హోటల్‌లో సంగీత ప్రదర్శనకి వచ్చి అక్కడ ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడతారు.

8. ఏ క్రిస్మస్ ప్రిన్స్ : ఇందులో ఒక అమెరికన్ జర్నలిస్టు (రోజ్ మెక్‌ఇవర్) క్రిస్మస్ సమయంలో స్కూప్ కోసం కాల్పనిక దేశమైన అల్డోవియాకి ప్రయాణిస్తుంది. అక్కడ ఆల్డోవియన్ ప్రిన్స్ (బెన్ లాంబ్)తో ప్రేమలో పడుతుంది.

9. జింగిల్ జాంగిల్ : ఏ క్రిస్మస్ జర్నీ : ఈ హాలిడే మ్యాజిక్‌తో నిండిన డేవిడ్ ఇ. టాల్బర్ట్ సంగీత ఫాంటసీ మిస్ చేయకూడని క్రిస్మస్ మూవీ.

10. సింగిల్ ఆల్ ది వే : మైకేల్ యూరీ నటించిన ఈ రోమ్ కామ్ లో క్రిస్మస్ సెలవుల్లో ఒకమ్మాయికి బాయ్ ఫ్రెండ్ గా నటించడానికి వెళ్తాడు.

11. ఏ కాజీల్ ఫర్ క్రిస్మస్ : బ్రూక్ షీల్డ్స్ , క్యారీ ఎల్వెస్ మేరీ లాంబెర్ట్ హాయిగా నటించిన రోమాంటిక్ కామెడీలో ఇది.

12. ఏలియన్ క్రిస్మస్ : నక్షత్రమండలాల మద్య క్రిస్మస్ వేడుకలు జరుపుకునే గ్రహాంతర జీవుల యానిమేషన్ మూవీ ఇది.

13. డాలీ పాట్రన్స్ క్రిస్మస్ ఆన్ ది స్క్వేర్ : ఎమ్మీ-విజేత మ్యూజికల్ స్టార్ క్రిస్టీన్ బరాన్‌స్కీ, తన స్వస్థలంలో నివాసితుల్ని తొలగించి, రియల్ ఎస్టేట్‌ని మెగా-మాల్ డెవలపర్‌కి విక్రయించాలని చూసే హిలేరియస్ కామెడీ ఇది.

14. ప్రిన్సెస్ స్విచ్ : ఒక అమెరికన్ చెఫ్ క్రిస్మస్ బేకింగ్ లో పోటీపడి, అక్కడ యువరాజు కాబోయే భార్యని కలిసినప్పుడు ఆమె తనలాగే వుండడాన్ని చూసి కంగారుపడుతుంది. ఆ తర్వాత ఇద్దరూ స్థానాలు మార్చుకుని గందరగోళం సృష్టిస్తారు.

15. ది నైట్ బిఫోర్ క్రిస్మస్ : మధ్య యుగాల కథతో రోమాంటి ఫాంటసీ ఇది.

16. శాంటా : ఆస్కార్ నామినేషన్‌ పొందిన యానిమేటెడ్ ఫీచర్ ఇది.

17. నోయెల్ డైరీ : ఈ హాలిడే డ్రామా కాస్త రోమాన్స్, మరికాస్త మిస్టరీని అందిస్తుంది. అతని తల్లి మరణం తరువాత ఒక విజయవంతమైన నవలా రచయిత (జస్టిన్ హార్ట్లీ) ఎస్టేట్‌ని వ్యవహారాల్ని సెటిల్ చేయడానికి క్రిస్మస్ సందర్భంగా స్వగ్రామానికి వెళ్తాడు. అక్కడ సొంత కుటుంబ చరిత్ర గురించి సమాధానాల కోసం వెతుకుతున్న ఒక యువతిని (బారెట్ డాస్) కలుస్తాడు. కలిసి వాళ్ళిద్దరూ గతాల్నిఎదుర్కొంటారు – భవిష్యత్తుని కనుగొంటారు.

18. హాలిడే రష్ : హిప్-హాప్ డీజే రష్ (రోమనీ మాల్కో) రేడియో స్టేషన్ పాప్‌గా మారిన తర్వాత తన ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు, తన నలుగురు ఎందుకూ పనికి రాని పిల్లలతో పాత ఇంటికి తిరిగి వెళ్ళి పాట్లు పడే కామెడీ కథ ఇది.

19. హాలిడే క్యాలండర్ : ఈ రోమ్-కామ్ ఇద్దరు జీవితకాల స్నేహితుల (క్యాట్ గ్రాహం, క్విన్సీ బ్రౌన్) కథ. ఇద్దరూ ఫోటోగ్రాఫర్‌లే. లు, వారి డిసెంబర్ రీయూనియన్ క్యాలెండర్ లో ఒక రహస్యం వుంటుంది...

20. క్రిస్మస్ క్రానికల్స్ : శాంటాగా కర్ట్ రస్సెల్ క్రిస్మస్ ఈవ్ రాత్రి మధ్యలో పిల్లలకి పంచడానికి తెచ్చిన బహుమతుల సంచిని పోగొట్టుకున్నప్పుడు తీవ్ర కామెడీ ఎపిసోడ్లతో నడిచే సరదా కథ.

ఈ ఇరవై క్రిస్మస్ సినిమాలతో పండుగని ఎంజాయ్ చేయండి! మన భాషల్లో క్రిస్మస్ సినిమాలు లేకపోయినా, హాలీవుడ్ నుంచి అందే మూవీ బొకేతో ఎంటర్ టైన్మెంట్ మామూలుగా వుండదు!


First Published:  25 Dec 2023 12:43 PM IST
Next Story