ఈవారం 16 సినిమాలతో చలన చిత్రోత్సవాలు!
Telugu Movies Theatre releasing this week: ఈ వారం ఏకంగా 16 సినిమాలు విడుదలవుతున్నాయి! చూస్తే ఏదో చలన చిత్రోత్సవాలు జరుగుతున్నాయా అన్పించేట్టు ఈ హడావిడి కన్పిస్తోంది.
తెలుగు సినిమాలు టోకున విడుదలయ్యే ట్రెండ్ ఆగడం లేదు. ఆరు సినిమాలు, ఎనిమిది సినిమాలు, తొమ్మిది సినిమాలూ ఒకేసారి విడుదలవుతున్న ట్రెండ్ ని ప్రేక్షకులు గమనించే వుంటారు. వాటిలో ఎన్ని చూస్తున్నారో కూడా తెలీదు. ఎవరి కోసం విడుదల చేస్తున్నారో నిర్మాతలకీ తెలియడం లేదు. ఒకేసారి ఇన్నేసి విడుదల చేసి ఎవరు లాభపడుతున్నారో తెలీదు. అయినా క్లియరెన్స్ సేల్ అన్నట్టు చిన్న సినిమాల విడుదలలు ఆగడం లేదు. గత కొన్ని వారాలు ఒకెత్తు అయితే ఈ ఒక్క వారమే ఒకెత్తు. ఈ వారం ఏకంగా 16 సినిమాలు విడుదలవుతున్నాయి! చూస్తే ఏదో చలన చిత్రోత్సవాలు జరుగుతున్నాయా అన్పించేట్టు ఈ హడావిడి కన్పిస్తోంది. జనవరి వచ్చిందంటే సంక్రాంతికి భారీ సినిమాలుంటాయి. అందుకని ఈలోగా చిన్న బడ్జెట్ సినిమాలు విడుదల చేసుకుంటే సేఫ్ అని భావించడంతో ఈ పరిస్థితి. వీటిలో కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా వున్నాయి. రాంగోపాల్ వర్మ తెలుగు కూడా వుంది. పూర్తి వివరాలు కింద చూద్దాం.
1. ముఖ చిత్రం : విశ్వక్ సేన్, ఆయేషా ఖాన్, ప్రియా వడ్లమాని తదితరులు; సంగీతం: కాల భైరవ, దర్శకత్వం : గంగాధర్.
2. పంచతంత్రం : బ్రహ్మానందం, స్వాతీ రెడ్డి, సముద్రకని, శివాత్మికా రాజశేఖర్ తదితరులు; సంగీతం :ప్రశాంత్ విహారి, దర్శకత్వం: హర్ష పులిపాక
3. గుర్తుందా శీతాకాలం : సత్యదేవ్, తమన్నా, కావ్యా శెట్టి తదితరులు; సంగీతం : కాల భైరవ, దర్శకత్వం : నాగ శేఖర్.
4. ప్రేమదేశం : మధుబాల, మేఘా ఆకాష్, త్రిగుణ్ తదితరులు; సంగీతం : మణిశర్మ, దర్శకత్వం : ఎస్. శ్రీకాంత్
5. లెహరాయి : రంజిత్, సౌమ్యా మీనన్, గగన్ విహారి, రావు రమేష్, నరేష్ తదితరులు; సంగీతం : ఘంటాడి కృష్ణ, దర్శకత్వం : రామకృష్ణ పరమహంస
6. చెప్పాలని వుంది : యష్ పురి, స్టెఫీ పటలే, సునీల్, మురళీశర్మ, తనికెళ్ళ భరణి తదితరులు; సంగీతం : ఎం. అస్లామ్, దర్శకత్వం : అరుణ్ బి
7. నమస్తే సేట్ జీ : సాయికృష్ణ, స్వప్నా చౌదరి తదితరులు; దర్శకత్వం : సాయికృష్ణ
8. రాజయోగం : సాయి రోనాక్, అంకితా సాహా తదితరులు; దర్శకత్వం: ఆర్ గణపతి
9. డేంజరస్ : అప్సరా రాణి, నైనా గంగూలీ, రాజ్ పల్ యాదవ్ తదితరులు; దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
10. విజయానంద్ (డబ్బింగ్ కన్నడ): రవిచంద్రన్, నిహాల్ రాజ్ పుత్, అనంత్ నాగ్, అనీష్ కురువిల్లా తదితరులు; సంగీతం : గోపీ సుందర్, దర్శకత్వం : రిషికా శర్మా
11. రామాపురం : దర్శకత్వం : హేమా రెడ్డి
12. ఐ లవ్యూ యూ ఇడియట్ : దర్శకత్వం : ఏపీ అర్జున్
13. మనం అందరికీ ఒక్కటే: దర్శకత్వం : నేతి సత్య శేఖర్
14. సివిల్ ఇంజనీరింగ్ (డబ్బింగ్ తమిళం) : దర్శకత్వం : ఎం. శరవణన్
15. ఆక్రోశం (డబ్బింగ్ తమిళం) : దర్శకత్వం : కుమార శీలన్
16. ఏయ్ బుజ్జీ నీకు నేనే : దర్శకత్వం : ఎస్ వి ఆర్