Mutual Funds SIP | `సిప్`లో ప్రతియేటా 10 శాతం పొదుపు పెంపుతో 20 ఏండ్లలో కార్ఫస్ ఫండ్ ఎంతవుందో తెలుసా..?!
Mutual Funds SIP | ప్రతి ఒక్కరికీ జీవితంలో లక్ష్యాలు, ఆకాంక్షలు, అభిరుచులు ఉంటాయి. కనుక తమ ఆదాయంలో కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఖర్చులు ఉంటాయి.
Mutual Funds SIP | ప్రతి ఒక్కరికీ జీవితంలో లక్ష్యాలు, ఆకాంక్షలు, అభిరుచులు ఉంటాయి. కనుక తమ ఆదాయంలో కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఖర్చులు ఉంటాయి. రోజురోజుకు ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉన్న ప్రస్తుత తరుణంలో భవిష్యత్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని కొంత మొత్తం పొదుపు చేస్తూ ఉండాలి. అలా పొదుపు చేస్తున్న సొమ్ము మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) కింద నిరంతరం పెంచుతూ పోతే రిటర్న్స్ కూడా భారీగానే ఉంటాయి.
ఉదాహరణకు మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా రూ.10 వేలు ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుందాం. దానిపై రిటర్న్స్ 12 శాతం ఉంటాయి. 20 ఏండ్లు పూర్తయ్యే సరికి రూ.కోటి పొదుపు అవుతుంది. ఒకవేళ మీరు ప్రతియేటా మీ మ్యూచువల్ ఫండ్ `సిప్`లో పది శాతం పెట్టుబడులు పెంచుకుంటూ పోతే 16 ఏండ్లలోనే రూ.కోటి లకు చేరుతుంది. తొలి సంవత్సరంలో ఒక నెల రూ.10 వేలు ఇన్వెస్ట్ చేశారు. ఏడాది తర్వాత రూ.11 వేలు, మూడో ఏడాది రూ.12,100.. ఏడాదికేడాది పది శాతం చొప్పున సిప్ పెట్టుబడులు పెంచుకుంటూ పోయారనుకుంటే 16 ఏండ్ల తర్వాత రూ. కోటి, ఆ తర్వాత నాలుగేండ్లలో అంటే 20 ఏండ్ల టెన్యూర్ పూర్తయ్యే సరికి కార్పస్ ఫండ్ దాదాపు రెట్టింపు రూ.1.99 కోట్లవుతుంది. ఫిక్స్‌డ్ సిప్ ప్లాన్‌లో మీరు ప్రతి ఏటా 10 శాతం పెట్టుబడులు పెంచుకుంటూ వెళితే.. మెచ్యూరిటీ టైం నాటికి మీరు పొదుపు చేసిన మొత్తం దాదాపు రెట్టింపు అవుతుంది.
ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం తప్పనిసరిగా పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు చూస్తున్నారు. ద్రవ్యోల్బణం ఆరు శాతం వద్దే తచ్చాడుతూ ఉన్నట్లయితే ఈ రోజు ఒక వస్తువు ధర రూ.100 ఉంటే, 20 ఏండ్ల తర్వాత రూ.320 పలుకుతుంది. ద్రవ్యోల్బణంపై పోరాటంతోపాటు జీవిత లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌మెంట్, పొదుపు చర్యలు కూడా కీలకమే.
కెరీర్ ప్రారంభంలో తక్కువ ఆదాయంతో భారీ మొత్తంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)లో పెట్టుబడులు పెట్టడం కాసింత క్లిష్టతరమైన అంశం. చాలా మంది తమ ఆదాయం పెరుగుదలకు అనుగుణంగా తమ పొదుపు సామర్థ్యం పెంచుకుంటూ వెళుతుంటారు. రెగ్యులర్ సేవింగ్స్ పెంచుకోవడంపై దృష్టి పెట్టే వారికి సిప్ ప్లాన్ ఉపయుక్తంగా ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. క్రమానుగతంగా ఆదాయం పెరుగుదలకు అనుగుణంగా సిప్ ప్లాన్‌కు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఇన్వెస్టర్లలో క్రమశిక్షణ పెంచుతుందని మై వెల్త్ గ్రోత్ కో ఫౌండర్ హర్షద్ చేతన్‌వాలా తెలిపారు.
దీర్ఘకాలంలో సుపీరియర్ రిటర్న్స్‌కు పెట్టింది పేరు ఈక్విటీ మార్కెట్. 2013 నుంచి గత పదేండ్లుగా సెన్సెక్స్ ప్రైస్ ఇండెక్స్ 12.8 శాతం, సెన్సెక్స్ టీఆర్ఐ ఇండెక్స్ 14.3 శాతం రిటర్న్స్ ఇస్తున్నాయి అని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ నివేదిక పేర్కొంది. రెగ్యులర్ ధరల ఆధారిత సెన్సెక్స్ గత 20 ఏండ్లలో 15.5 శాతం, టీఆర్ఐ సెన్సెక్స్ 17.2 శాతం రిటర్న్స్ అందించాయని ఆ నివేదిక సారాంశం.