Telugu Global
Business

Digital Gold | మీరు డిజిట‌ల్ గోల్డ్ కొనుగోలు చేస్తున్నారా..? అందుకేం చేయాలంటే..?!

Digital Gold | భార‌తీయులు పండుగ‌లు, పెండ్లిండ్లు, కుటుంబ వేడుకలు.. ప్ర‌త్యేకించి దంతేరాస్‌, దీపావ‌ళి, అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా బంగారం కొనుగోలు చేయ‌డం సంప్ర‌దాయం.

Digital Gold | మీరు డిజిట‌ల్ గోల్డ్ కొనుగోలు చేస్తున్నారా..? అందుకేం చేయాలంటే..?!
X

Digital Gold | మీరు డిజిట‌ల్ గోల్డ్ కొనుగోలు చేస్తున్నారా..? అందుకేం చేయాలంటే..?!

Digital Gold | భార‌తీయులు పండుగ‌లు, పెండ్లిండ్లు, కుటుంబ వేడుకలు.. ప్ర‌త్యేకించి దంతేరాస్‌, దీపావ‌ళి, అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా బంగారం కొనుగోలు చేయ‌డం సంప్ర‌దాయం. కానీ క్ర‌మంగా ఫిజిక‌ల్ గోల్డ్ కొనుగోళ్ల నుంచి డిజిట‌ల్ గోల్డ్ వైపు మ‌ళ్లిస్తున్నారు. ఫిజిక‌ల్ గోల్డ్‌తో పోలిస్తే డిజిట‌ల్ గోల్డ్ సుర‌క్షితం మాత్ర‌మే కాదు.. ఫిజిక‌ల్ గోల్డ్ కంటే తేలిగ్గా కొనుక్కోవ‌చ్చు.. విక్ర‌యించ‌వ‌చ్చు.

మీరు మీ సౌల‌భ్యానికి అనుగుణంగా డిజిట‌ల్ బంగారం తేలిగ్గా కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో పొదుపు చేసుకోవ‌చ్చు. ప్ర‌తి ఆన్‌లైన్ లావాదేవీ ద్వారా కొనుగోలు చేసే డిజిట‌ల్ గోల్డ్.. ఫిజిక‌ల్ గోల్డ్ విలువ‌కు స‌మానంగా ఉంటుంది. ఎంత మొత్తం సొమ్ముతోనైనా, ప‌లు ద‌ఫాలు డిజిట‌ల్ గోల్డ్ కొనుగోలు చేయ‌వ‌చ్చు.

భార‌తీయులెవ‌రైనా డిజిట‌ల్ గోల్డ్ కొనుగోలు చేయొచ్చు. డిజిట‌ల్ గోల్డ్ కొనుగోలు చేయ‌డానికి బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ గానీ, క‌రంట్ ఖాతా గానీ క‌లిగి ఉండాలి. 18 ఏండ్ల లోపు మైన‌ర్ గానీ డిజిట‌ల్ గోల్డ్ కొన‌డానికి అన‌ర్హులు. ఎన్నార్వో అకౌంట్ లేకుండా ఎన్నారై కూడా డిజిట‌ల్ గోల్డ్ కొనుగోలు చేయ‌డానికి నిబంధ‌న‌లు అనుమ‌తించ‌వు.

గూగుల్ పే ఆధారంగా డిజిట‌ల్ గోల్డ్ కొనుగోలు చేయ‌డం ఎలా..?

గూగుల్ పే ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడానికి అనుస‌రించాల్సిన మార్గాలిలా..

* గూగుల్ పే ఓపెన్ చేసి న్యూ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. సెర్చ్ బార్‌లోకి వెళ్లి గోల్డ్ లాక‌ర్‌ గురించి సెర్చ్ చేయాలి. అటుపై గోల్డ్ లాక‌ర్‌పై క్లిక్ చేయాలి.

* బై ఆప్ష‌న్ టాబ్ ఓపెన్‌ చేస్తే ప‌న్నుతోపాటు ప్ర‌స్తుత మార్కెట్లో బంగారం ధ‌ర క‌నిపిస్తుంది. మీరు కొనుగోలు ప్ర‌క్రియ ప్రారంభించిన త‌ర్వాత ఐదు నిమిషాల‌కు ఈ ధ‌ర లాక్ అవుతుంది. కొనుగోలు చేసిన త‌ర్వాత ధ‌ర మారుతుండ‌వ‌చ్చు.

* మీరు కొనుగోలు చేయ‌త‌ల‌పెట్టిన బంగారానికి స‌మానంగా సొమ్ము రూ.ల్లో న‌మోదు చేయాలి. అటుపై పే మెంట్ ప‌ద్ద‌తి ఎంపిక చేసుకుని ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయాలి.

* లావాదేవీ పూర్త‌యిన త‌ర్వాత కొన్ని నిమిషాల్లో మీ లాక‌ర్‌లో బంగారం క‌నిపిస్తుంది. ఒక‌సారి డిజిట‌ల్ గోల్డ్ కొనుగోలు చేయ‌డానికి ప్ర‌క్రియ పూర్తి చేసిన త‌ర్వాత ర‌ద్దు చేయ‌డానికి కుద‌ర‌దు. కావాల‌నుకుంటే మ‌ళ్లీ మార్కెట్ రేట్‌కు విక్ర‌యించ‌వ‌చ్చు.

* మీరు ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా పూర్తిగా కాకుంటే.. మీరు చెల్లించిన మొత్తం తిరిగి మీ బ్యాంకు ఖాతాలో జ‌మ అవుతుంది. మీరు నివ‌సించే ప్రాంతం, మీ పోస్ట‌ల్ కోడ్ ఆధారంగా బంగారం ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయి. డిజిట‌ల్ గోల్డ్ కొనుగోలుకు గ‌రిష్ట ప‌రిమితుల్లేవు. క‌నిష్టంగా ఒక యూనిట్ బంగారం కొనుగోలు చేయాలి. రోజువారీగా రూ.50 లోపు విలువ గ‌ల బంగారం కొనుగోలు చేయొచ్చు. రూ.49,999కి పైగా చెల్లించి బంగారం కొనుగోలు చేస్తే త‌ప్ప‌నిస‌రిగా కేవైసీ నిబంధ‌న‌లు పాటించాల్సిందే.

First Published:  4 Nov 2023 4:12 PM IST
Next Story