Telugu Global
Business

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ రూల్స్ మారుతున్నాయి!

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ మొదలవుతుంది. అయితే ఈ కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలుకాబోతున్నాయి.

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ రూల్స్ మారుతున్నాయి!
X

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ మొదలవుతుంది. అయితే ఈ కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలుకాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ట్యాక్స్ విధానాలు మారబోతున్నాయి అంటూ కొన్ని వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఆర్థిక శాఖ ట్విటర్‌‌లో స్పష్టత ఇచ్చింది. కొత్త ట్యాక్స్ విధానంలో సంస్థలతో పాటు వ్యక్తులకు కూడా డిఫాల్ట్​ పన్ను విధానం అమలు అవుతుంది. పన్ను కట్టేవాళ్లు కొత్త లేదా పాత పన్ను విధానాల్లో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

ఫాస్టాగ్ కెవైసీ

ఏప్రిల్ 1 నుంచి కేవైసీ అప్‌డేట్ చేయని ఫాస్టాగ్స్ డీయాక్టివేట్ అవుతాయి. కేవైసీ లేని ఫాస్టాగ్‌లను బ్యాంకులు డీయాక్టివేట్ చేస్తాయి. ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా కైవైసీ జరగనిదే పేమెంట్ జరగదు. కాబట్టి ఫాస్టాగ్ యూజర్లు వీలైనంత త్వరగా కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి.

ఈపీఎఫ్ఓ రూల్స్

ఏప్రిల్ 1 నుంచి కొన్ని ఈపీఎఫ్ఓ రూల్స్ కూడా మారనున్నాయి. కొత్త రూల్ ప్రకారం ఉద్యోగి సంస్థ మారిన తర్వాత పీఎఫ్ అకౌంట్ ఆటోమెటిక్‌గా బదిలీ అవుతుంది. ఉద్యోగులు ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

క్రెడిట్‌ కార్డ్ రూల్స్‌

కొత్త ఫైనాన్షియల్ ఇయర్ నుంచి రెంట్ చెల్లింపుల కోసం ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ రివార్డ్‌ పాయింట్లు ఉపయోగించలేరు. అలాగే ఎస్ బీఐ డెబిట్‌ కార్డుల మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమలవుతాయి.

డిజిటల్ పాలసీలు

ఏప్రిల్ 1 నుంచి బీమా పాలసీలకు డిజిటలైజేషన్‌ తప్పనిసరి. ఇకపై అన్ని బీమా సంస్థలూ డిజిటల్ పద్దతిలో పాలసీలను అందించాలి. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్, ట్రావెల్.. ఇలా కేటగిరీ ఏదైనా డిజిటల్ పద్ధతిలోనే పాలసీ ఇవ్వాలి.

ఎన్‌పీఎస్ రూల్‌

నేషనల్ పెన్షన్ సిస్టమ్ యూజర్లందరూ ఇకపై ‘టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్’ను ఎనేబుల్ చేసుకోవాలి. పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యేవాళ్లంతా ఇకపై టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ విధానంలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

First Published:  1 April 2024 4:15 PM IST
Next Story