Telugu Global
Business

విమాన సర్వీసులకు 'విస్తారా' టాటా!

టాటా ఎయిర్‌ ఇండియాలో విలీనమవుతున్న విస్తారా

విమాన సర్వీసులకు విస్తారా టాటా!
X

ప్రముఖ పౌరవిమానయాన సంస్థ విస్తారా విమాన సర్వీసులకు టాటా చెప్పేస్తోంది. కొన్ని గంటల్లోనే ఆ సంస్థ సేవలు శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. పదేళ్లుగా పౌరవిమానయాన రంగంలో సేవలందించిన విస్తారా గ్రూప్‌ టాటా ఎయిర్‌ ఇండియా సంస్థల్లో విలీనమవుతోంది. నవంబర్‌ 12న అంటే ఈ అర్ధరాత్రికే విలీనం అమల్లోకి రానుంది. విస్తారాకు చెందిన చూకే 986 విమానం ముంబయి నుంచి ఢిల్లీకి సోమవారం రాత్రి 10.45 గంటలకు బయల్దేరుతుంది. ఢిల్లీ నుంచి సింగపూర్‌ కు యూకే 115 విమానం రాత్రి 11.45 గంటలకు టేకాఫ్‌ అవుతుంది. మంగళవారం నుంచి విమానం 'యూకే' కనుమరుగై 'ఏఐ2....' అనే కొత్త కోడ్‌ రానుంది. 2015 జనవరి 9న విస్తారా తన సేవలను ప్రారంభించింది. ఆ రోజు ముంబయి నుంచి ఢిల్లీకి మొదటి వినాన సర్వీసును నడిపించిన సంస్థ తన చివరి సర్వీసును అదే రూట్లో నడిపిస్తోంది. టాటా గ్రూప్‌ 51 శాతం, సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌ 49 శాతం షేర్లున్న సంస్థనే విస్తారా.. కొంతకాలం క్రితం టాటా గ్రూప్‌ ఎయిర్‌ ఇండియాను టేకోవర్‌ చేసింది. దీంతో విస్తారా తన రూపం మార్చుకొని టాటా ఎయిర్‌ ఇండియా కాబోతుంది. విలీనం తర్వాత సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌ వాటా 25.1 శాతంగా ఉండబోతుంది. ఎయిర్‌ ఇండియాలో విస్తారా విలీనం తర్వాత సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌ రూ.3,195 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ఏడాది అక్టోబర్‌ లో టాటా ఎయిర్‌ ఇండియాలో ఏఐఎక్స్‌ కనెక్ట్‌ విలీనం అయ్యింది. రెండు నెలల్లోపే విస్తారా విలీనమవుతోంది.

First Published:  11 Nov 2024 4:14 PM GMT
Next Story