Telugu Global
Business

ఆ రెండు దేశాల దిగుమతులపై 25 శాతం సుంకాల అమలు నేటి నుంచే

అమెరికాలో ఫెంటానిల్‌ డ్రగ్స్‌ అక్రమ రవాణాను అడ్డుకోవడానికే మెక్సికో, కెనడా దేశాలపై అధిక సుంకాలు విధించినట్లు ట్రంప్‌ వెల్లడి

ఆ రెండు దేశాల దిగుమతులపై 25 శాతం సుంకాల అమలు నేటి నుంచే
X

మెక్సికో, కెనడా దేశాల దిగుమతులపై 25 శాతం సుంకాలు నేటి నుంచి అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అమెరికాలో ఫెంటానిల్‌ డ్రగ్స్‌ అక్రమ రవాణాను అడ్డుకోవడానికే ఈ రెండు దేశాలపై అధిక సుంకాలు విధించినట్లు స్పష్టం చేశారు. అమెరికాకు రాయితీలు ఇస్తామని మెక్సికో, కెనడా దేశాలు హామీ ఇవ్వగా.. ట్రంప్‌ వాటిపై సుంకాల విధింపులు ఒక నెల రోజులు ఆలస్యం చేశారు. కానీ తాజాగా ఇరుదేశాల దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించారు. కొత్త సుంకాలను తప్పించుకోవడానికి కెనడా, మెక్సికో ఎలాంటి అవకాశం లేదని ట్రంప్‌ పేర్కొన్నాడు. మరోవైపు ఇప్పటికే చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించిన ట్రంప్‌ అదనంగా మరో 10 శాతం సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. అమెరికా దేశాధ్యక్షుడి ప్రకటనతో ఆ దేశ స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలు చవి చూసింది.

First Published:  4 March 2025 11:47 AM IST
Next Story