Telugu Global
Business

Credit Card Diwali Offers | దీపావ‌ళి పండుగ‌కు బ్యాంకుల బంప‌రాఫ‌ర్లు.. డిస్కౌంట్స్ టు క్యాష్‌బ్యాక్‌ల వ‌ర్షం.. ఇవీ డిటైల్స్‌..!

Credit Card Diwali Offers | ప్ర‌స్తుతం పండుగ‌ల సీజ‌న్ న‌డుస్తోంది. మ‌రో రెండు రోజుల్లో దీపావ‌ళి పండుగ వ‌స్తోంది. మ‌రోవైపు పెండ్లిండ్లు ఇత‌ర శుభ కార్యాలు ప్రారంభం అవుతున్నాయి.

Credit Card Diwali Offers | దీపావ‌ళి పండుగ‌కు బ్యాంకుల బంప‌రాఫ‌ర్లు.. డిస్కౌంట్స్ టు క్యాష్‌బ్యాక్‌ల వ‌ర్షం.. ఇవీ డిటైల్స్‌..!
X

Credit Card Diwali Offers | ప్ర‌స్తుతం పండుగ‌ల సీజ‌న్ న‌డుస్తోంది. మ‌రో రెండు రోజుల్లో దీపావ‌ళి పండుగ వ‌స్తోంది. మ‌రోవైపు పెండ్లిండ్లు ఇత‌ర శుభ కార్యాలు ప్రారంభం అవుతున్నాయి. దీనికి తోడు క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫీవ‌ర్‌.. పండుగ‌ల‌కు ప్ర‌త్యేకించి దీపావళికి భార‌తీయులు బంగారం కొనుక్కోవ‌డం, ముఖ్య‌మైన వ‌స్తువులు సొంతం చేసుకోవ‌డ‌మో.. లేదా బంధు మిత్రుల‌కు బ‌హుమ‌తులు ఇవ్వ‌డ‌మో చేస్తుంటారు.. భార‌తీయుల సెంటిమెంట్‌కు అనుగుణంగా ప‌లు బ్యాంకులు దీపావ‌ళి సంద‌ర్భంగా అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌తో క‌స్ట‌మ‌ర్ల ముంగిట్లోకి వ‌చ్చాయి. డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌పై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు, రివార్డుల‌తో దీపావ‌ళి పండుగ‌ను క‌న్నుల పండువ‌గా చేసుకునేలా చేస్తున్నాయి. అయితే ఒక్కొక్క‌రి అవ‌స‌రాలు, ఆదాయం వేర్వేరుగా ఉంటాయి. త‌ద‌నుగుణంగానే క‌స్ట‌మ‌ర్లు దీపావ‌ళి షాపింగ్ చేస్తున్న‌ప్పుడు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని ఆర్థిక‌వేత్త‌లు సూచిస్తున్నారు. అయితే, ఎస్బీఐ మొద‌లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకు క్రెడిట్ కార్డుల‌పై అందిస్తున్న ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు చూసొద్దామా..!

దీపావ‌ళికి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫ‌ర్లు ఇలా

బోచ్ (Bosch) గృహోప‌క‌ర‌ణాలు మొద‌లు వివిధ ఉత్ప‌త్తుల‌పై 20 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌,

గ్రీన్ ఈస్ట‌ర‌న్ ఉత్ప‌త్తుల కొనుగోళ్లపై ఐదు శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌,

ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌,

హ‌య‌ర్ (Haier) ఉత్ప‌త్తులు కొనుగోలు చేస్తే 22.5 శాతం వ‌ర‌కూ ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌,

మైంత్రా (Myntra) ఉత్ప‌త్తుల కొనుగోళ్ల‌పై 10 శాతం డిస్కౌంట్‌,

మ్యాక్స్ (Max), పాంట‌లూన్స్ (Pantaloons), మోంటే కార్లో (Monte Carlo), రేమండ్ (Raymond) కొనుగోళ్ల‌పై ఐదు శాతం క్యాష్ బ్యాక్‌,

శాంసంగ్ (Samsung) స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్ల‌పై రూ.5000 వ‌ర‌కూ క్యాష్ బ్యాక్‌,

ఒప్పో (Oppo) స్మార్ట్ ఫోన్ కొనుగోళ్ల‌పై 10 శాతం డిస్కౌంట్‌,

వివో (Vivo) స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్ల‌పై రూ.10 వేల వ‌ర‌కూ డిస్కౌంట్‌,

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఆఫ‌ర్లు ఇలా

ఎల్‌జీ ఎల‌క్ట్రానిక్స్ ఉత్ప‌త్తులు కొనుగోలు చేస్తున్న వారికి ఈజీ ఈఎంఐ ఆప్ష‌న్ల‌తోపాటు రూ.26 వేల వ‌ర‌కూ ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌,

ఆపిల్ ఉత్ప‌త్తుల కొనుగోలు చేస్తున్న వారికి ఈజీ ఈఎంఐ ఆప్ష‌న్‌తోపాటు రూ.5,000 వ‌ర‌కూ ఆదా,

రిల‌యన్స్ రిటైల్‌లో వాషింగ్ మిష‌న్లు, టెలివిజ‌న్‌లు కొనుగోలు చేస్తే రూ.7,500 క్యాష్‌బ్యాక్‌,

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క‌స్ట‌మ‌ర్ లోన్ల‌పై రూ.10 వేల వ‌ర‌కూ క్యాష్ బ్యాక్‌,

హోమ్ సెంట‌ర్ వ‌ద్ద హెచ్‌డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు & ఈజీ ఈఎంఐ కొనుగోళ్ల‌పై 10 శాతం డిస్కౌంట్‌,

శాంసంగ్ మొబైల్ ఫోన్ కొనుగోలుపై రూ.12 వేల క్యాష్‌బ్యాక్‌.

పాపుల‌ర్ అప్పారెల్ బ్రాండ్ల దుస్తులు కొనుగోలు చేసిన వారికి 10 శాతం వ‌ర‌కూ ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌.

పాథీస్ స్వ‌ర్ణ‌మ‌హాల్ (Pothys Swarnamahal) వ‌ద్ద కొనుగోలు చేస్తే రూ.5,000 వ‌ర‌కూ ధ‌ర త‌గ్గింపు.

మైక్‌మై ట్రిప్ (MakeMyTrip) ద్వారా దేశీయ విమాన టికెట్ల కొనుగోలుపై 20 శాతం ధ‌ర రాయితీ.

ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్/ క్రెడిట్ కార్డుల‌పై ఆఫ‌ర్లు

రిల‌య‌న్స్ డిజిట‌ల్‌లో సెలెక్టెడ్ క్యాట‌గిరీ వ‌స్తువుల‌పై 10 శాతం డిస్కౌంట్‌. గ‌రిష్టంగా రూ.10 వేల వ‌ర‌కూ రాయితీ,

శాంసంగ్ ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల కొనుగోళ్ల‌పై 22.5 శాతం క్యాష్‌బ్యాక్ (గ‌రిష్టంగా రూ.25,000),

ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, ఈఎంఐ ద్వారా ఎల్‌జీ ఉత్ప‌త్తులు కొనుగోలు చేస్తే 26 శాతం క్యాష్‌బ్యాక్.. గ‌రిష్టంగా రూ.26 వేల వ‌ర‌కూ వ‌ర్తింపు,

విజ‌య్ సేల్స్‌పై రూ.5000 వ‌ర‌కూ డిస్కౌంట్‌,

వ‌న్‌ప్లస్ ఉత్ప‌త్తుల‌పై రూ.5,000 వ‌ర‌కూ డిస్కౌంట్‌,

షియోమీ మొబైల్స్‌, టీవీలు, టాబ్లెట్ల‌పై రూ.7,500 వ‌ర‌కూ డిస్కౌంట్‌,

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్‌పై 10 శాతం ధ‌ర త‌గ్గింపు,

సెలెక్టెడ్ ప్లాట్‌ఫామ్స్‌తోపాటు విమాన టికెట్ల కొనుగోలుపై 12 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌.

కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌పై దీపావ‌ళి ఆఫ‌ర్లు

శాంసంగ్ ఉత్ప‌త్తుల కొనుగోలుపై (కోట‌క్ క్రెడిట్ కార్డు, ఈఎంఐ పేమెంట్స్‌) రూ.25 వేల వ‌ర‌కూ క్యాష్‌బ్యాక్‌,

ఐఎఫ్‌బీ వ‌ద్ద కొనుగోళ్ల (కోట‌క్ క్రెడిట్ కార్డు, ఈఎంఐ చెల్లింపు) పై 20 శాతం క్యాష్‌బ్యాక్ (గ‌రిష్టంగా రూ.9,000),

గోద్రేజ్ ఉత్ప‌త్తుల కొనుగోళ్ల (కోట‌క్ బ్యాంక్ డెబిట్ కార్డు ఈఎంఐ, స్మార్ట్ ఈఎంఐ కార్డు)పై రూ.12 వేల వ‌ర‌కూ ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌.

వ‌ర్ల్‌పూల్‌లో కొనుగోళ్ల (కోట‌క్ మ‌హీంద్రా క్రెడిట్ కార్డు)పై 15 శాతం క్యాష్‌బ్యాక్ (గ‌రిష్టంగా రూ.7,500 రాయితీ).

యాత్రా డాట్ కామ్‌లో క్రెడిట్ కార్డు ఈఎంఐ చెల్లింపుల‌పై రూ.5,000 వ‌ర‌కూ క్యాష్‌బ్యాక్‌.

అంత‌ర్జాతీయ విమాన టికెట్ల కొనుగోలుపై రూ.5000 వ‌ర‌కూ ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌, దేశీయ విమాన టికెట్ల కొనుగోలుపై రూ.1,500 వ‌ర‌కూ ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌.

మైంత్రాలో కోట‌క్ డెబిట్ కార్డులు, స్పెండ్జ్ కార్డుల క‌నీస లావాదేవీ రూ.3000 జ‌రిపితే రూ.1000 డిస్కౌంట్‌.

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఇలా దీపావ‌ళి ఆఫ‌ర్లు

ఎల్‌జీ టీవీ, ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్‌, సెలెక్టెడ్ గృహోప‌క‌ర‌ణాల‌పై క్యాష్‌బ్యాక్‌,

శాంసంగ్ ఉత్ప‌త్తుల కొనుగోళ్ల (ఈఎంఐ ద్వారా చెల్లింపుల‌)పై క్యాష్‌బ్యాక్‌,

రిల‌య‌న్స్ డిజిట‌ల్‌లో సెలెక్టెడ్ క్యాట‌గిరీ వ‌స్తువుల‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌,

టాటా క్లిక్ ఉత్ప‌త్తుల కొనుగోళ్ల‌పై 10 శాతం డిస్కౌంట్‌,

లెనెవో ఆన్‌లైన్ స్టోర్‌లో లాప్‌టాప్‌లు, ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల కొనుగోళ్ల‌పై అద‌నంగా రూ.2000 రాయితీ.

First Published:  10 Nov 2023 8:30 AM IST
Next Story