నేడు (29-12-2022) పెరిగిన బంగారం, వెండి ధరలు
నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 వరకూ పెరిగి రూ.50,150కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.230 వరకూ పెరిగి రూ.54,170కి చేరుకుంది.
బంగారం ధరలు ఇటీవల కాలంలో కాస్త శాంతించినట్టు కనిపించినా తిరిగి పరుగు మొదలు పెట్టాయి. డిసెంబర్ 20 తర్వాత రెండు, మూడు రోజుల పాటు బంగారం ధరలో తగ్గుదల కనిపించినప్పటికీ ఎక్కువగా అయితే పెరగడమే జరుగుతోంది. దాదాపు డిసెంబర్ 23 నుంచి బంగారం ధర పెరుగుతూ వస్తోంది. ఇక నిన్న ఒక్కరోజు మాత్రం స్థిరంగా ఉండి కాస్త ఊరట కల్పించింది. తిరిగి నేడు మళ్లీ పెరిగి ఆర్నమెంట్ బంగారం రూ.50 వేల మార్కును దాటేసింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 వరకూ పెరిగి రూ.50,150కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.230 వరకూ పెరిగి రూ.54,170కి చేరుకుంది. కేజీ వెండిపై రూ.400 మేర పెరిగింది. గురువారం దేశ వ్యాప్తంగా బంగారం, ధర ఎలా ఉన్నాయో చూద్దాం.
22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.50,150.. రూ.54,710
విజయవాడలో రూ.50,150.. రూ. 54,710
విశాఖపట్నంలో రూ.50,150.. రూ. 54,710
చెన్నైలో రూ.51,050.. రూ.55,690
బెంగళూరులో రూ.50,200.. రూ. 54,760
ఢిల్లీలో రూ. 50,300.. రూ.54,860
ముంబయిలో రూ.50,150.. రూ.54,710
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,600
విజయవాడలో రూ. 74,600
విశాఖపట్నంలో రూ. 74,600
చెన్నైలో రూ. 74,600
కేరళలో రూ. 74,600
బెంగుళూరులో రూ. 74,600
న్యూఢిల్లీలో రూ. 72,300
ముంబైలో రూ.72,300