Telugu Global
Business

నేడు (23-12-2022) స్వల్పంగా పెరిగిన బంగారం ధర..

నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.150 మేర పెరిగి రూ.50,250కి చేరగా.. 24 క్యారెట్ల ధరపై రూ.170 పెరిగి.. రూ.54,820కి చేరుకుంది.

నేడు (23-12-2022) స్వల్పంగా పెరిగిన బంగారం ధర..
X

బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. నిన్న బంగారం ధర రూ.540 మేర పెరిగిన విషయం తెలిసిందే. అదే పెరుగుదలను నేడు సైతం కొనసాగించింది. అయితే నిన్న పెరిగినంతగా పెరగలేదు. నేడు తులం బంగారంపై రూ.170 వరకూ పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. నిజానికి దీపావళి అనంతరం నుంచి బంగారం పరుగు ప్రారంభ‌మైంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో తులం బంగారం ధర రూ.45 వేల వద్ద ఉండగా.. ప్రస్తుతం తులం రూ.50 వేల మార్కును దాటేసింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.150 మేర పెరిగి రూ.50,250కి చేరగా.. 24 క్యారెట్ల ధరపై రూ.170 పెరిగి.. రూ.54,820కి చేరుకుంది. వెండి కిలో ధర రూ.70,100గా ఉంది. ఇక తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.50,250.. రూ.54,820

విజయవాడలో రూ.50,250.. రూ.54,820

చెన్నైలో రూ.51,240.. రూ.55,900

బెంగళూరులో రూ.50,300.. రూ.54,870

కేరళలో రూ.50,250.. రూ.54,820

పుణేలో రూ.50,250.. రూ.54,820

ముంబైలో రూ.50,250.. రూ.54,820

ఢిల్లీలో రూ.50,400.. రూ.54,980

కోల్‌కతాలో రూ.50,250.. రూ.54,820

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,700

విజయవాడలో రూ.74,700

చైన్నైలో రూ.74,700

కేరళలో రూ.74,700

బెంగళూరులో రూ.74,700

పుణేలో రూ.70,100

ముంబైలో రూ.70,100

ఢిల్లీలో రూ.70,100

కోల్‌కతాలో రూ.70,100

First Published:  23 Dec 2022 9:08 AM IST
Next Story