Telugu Global
Business

Tata Punch | ఈ స‌బ్‌-4 మీట‌ర్ కంపాక్ట్ ఎస్‌యూవీ కారు దేశంలో టాప్ సెల్లింగ్.. ఇదేం ఎక్స్‌ట‌ర్‌.. స్విఫ్ట్‌.. వ్యాగ‌న్ ఆర్‌.. ఐ20 కానేకాదు

ఈ ఏడాది జూన్‌లో దేశీయంగా కార్ల విక్ర‌యాల్లో మొద‌టి స్థానాన్ని సంపాదించుకున్న‌ది. అదేం మారుతి సుజుకి.. హ్యుండాయ్‌.. మ‌హీంద్రా మోడ‌ల్ కారు కానేకాదు.. టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ కారు టాటా పంచ్‌.

Tata Punch | ఈ స‌బ్‌-4 మీట‌ర్ కంపాక్ట్ ఎస్‌యూవీ కారు దేశంలో టాప్ సెల్లింగ్.. ఇదేం ఎక్స్‌ట‌ర్‌.. స్విఫ్ట్‌.. వ్యాగ‌న్ ఆర్‌.. ఐ20 కానేకాదు
X

Tata Punch | ప్ర‌స్తుతం భార‌తీయుల్లో స్పెండింగ్ ఇన్‌కం అందుబాటులో ఉండ‌టంతో అధునాతన వ‌సతుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. క‌రోనాకు ముందు కార్ల విక్ర‌యాలు జ‌రిగినా, విశ్వమారి త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకే మొగ్గు చూపుతున్నారు. అందునా స్పేసియ‌స్‌గా, సేఫ్టీ ఫీచ‌ర్ల‌తో ఉన్న కార్లు.. ప్ర‌త్యేకించి ఎస్‌యూవీల‌పై మ‌న‌స్సు పారేసుకుంటున్నారు. ఎస్‌యూవీల్లో స‌బ్‌-4 మీట‌ర్ ఎస్‌యూవీలు ఉన్నాయి.

ఈ ఏడాది జూన్‌లో దేశీయంగా కార్ల విక్ర‌యాల్లో మొద‌టి స్థానాన్ని సంపాదించుకున్న‌ది. అదేం మారుతి సుజుకి.. హ్యుండాయ్‌.. మ‌హీంద్రా మోడ‌ల్ కారు కానేకాదు.. టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ కారు టాటా పంచ్‌. మూడు నెల‌ల్లోనే టాప్ సెల్లింగ్ కారుగా అవ‌త‌రించింది టాటా పంచ్‌. జ‌న‌వ‌రి-జూన్ మ‌ధ్య అత్య‌ధికంగా అమ్ముడైన కారు కూడా ఇదే.

2024 జూన్‌లోనూ అత్య‌ధికంగా అమ్ముడైన కారు టాటా పంచ్‌. గ‌త నెల‌లో 18,238 టాటా పంచ్ కార్లు అమ్ముడు పోయాయి. గ‌త మార్చిలోనూ 17,547, ఏప్రిల్‌లోనూ 19,158 యూనిట్ల విక్ర‌యాల‌తో టాప్ సెల్లింగ్ మైక్రో ఎస్‌యూవీగా టాటా పంచ్ నిలిచింది. జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి, మే నెల్ల‌లో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిల‌వ‌డ‌మే కాదు.. రికార్డు స్థాయిలో అధిక యూనిట్లు అమ్ముడైన కారుగా నిలిచింది.

టాటా పంచ్ కారు భార‌త్ మార్కెట్లో రెండు మోడ‌ల్స్‌లోనూ ల‌భిస్తుంది. ఇంట‌ర్న‌ల్ కంబుస్ట‌న్ ఇంజిన్ (ఐసీఈ), ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ (ఈవీ) అవ‌తార్‌లో మార్కెట్‌లో అందుబాటులో ఉందీ కారు. ఐసీఈ మోడ‌ల్ కారు 1.2 లీట‌ర్ల రెవొట్రోన్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ పెట్రోల్ రెవోట్రోన్ ఇంజిన్ గ‌రిష్టంగా 88 పీఎస్ విద్యుత్‌, 115 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. అంతే కాదు 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ వేరియంట్లుగా అందుబాటులో ఉంది. టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ కారు ఇంజిన్ గ‌రిష్టంగా 73 పీఎస్ విద్యుత్‌, 103 ఎన్ఎం టార్క్ విత్ 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్‌తో వ‌స్తోంది. టాటా పంచ్ (ఐసీఈ) కారు ధ‌ర రూ.6.13 ల‌క్ష‌ల నుంచి రూ.10.20 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది.

టాటా పంచ్.ఈవీ కారు ధ‌ర రూ.10.99 ల‌క్ష‌ల నుంచి రూ.15.49 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది. టాటా పంచ్‌.ఈవీ ఎస్‌యూవీ స్టాండర్డ్ వేరియంట్ 60కిలోవాట్ల మోటార్‌తో వ‌స్తుంది. ఈ మోటార్ గ‌రిష్టంగా 114 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. 25కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక్‌తో వ‌స్తున్న స్టాండ‌ర్డ్ టాటా పంచ్‌.ఈవీ కారు సింగిల్ చార్జింగ్‌తో 315 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది. టాటా పంచ్‌.ఈవీ కారు లాంగ్ రేంజ్ వేరియంట్ 90 కిలోవాట్ల మోటారుతో వ‌స్తోంది. 35 కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక్ సింగిల్ చార్జింగ్‌తో 421 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.

నెల‌వారీగా 2024 తొలి అర్ధ‌భాగంలో టాటా పంచ్ కార్ల సేల్స్ వివ‌రాలు ఇలా

జ‌న‌వ‌రి - 17,978 యూనిట్లు

ఫిబ్ర‌వ‌రి - 18,438 యూనిట్లు

మార్చి - 17,547 యూనిట్లు

ఏప్రిల్‌ - 19,158 యూనిట్లు

మే - 18,949 యూనిట్లు

జూన్‌ - 18,238 యూనిట్లు

First Published:  5 July 2024 3:30 AM GMT
Next Story