జీతం పెరగాలంటే ఇలా చేయాలి!
ఉద్యోగంలో పైకి ఎదగాలని, మంచి శాలరీలను అందుకోవాలని చాలామంది అనుకుంటారు. అయితే శాలరీల గురించి పైవాళ్లతో చర్చించడానకి మొహమాటపడుతుంటారు.
ఉద్యోగంలో పైకి ఎదగాలని, మంచి శాలరీలను అందుకోవాలని చాలామంది అనుకుంటారు. అయితే శాలరీల గురించి పైవాళ్లతో చర్చించడానకి మొహమాటపడుతుంటారు. కానీ, భయం లేకుండా శాలరీ గురించి మాట్లాడాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్. పనికి తగ్గ ఫలితం ఆశించడంలో తప్పు లేదంటున్నారు. అసలు శాలరీ పెంచమని అడిగే ముందు కొన్ని విషయాలు సరిచూసుకోవాలి. అవేంటంటే..
ఎక్కువ శాలరీలు ఆశించేముందు బాధ్యతలు సరిగ్గా నిర్వర్తిస్తున్నామో లేదో చెక్ చేసుకోవాలి. సంస్థ మీపై పెట్టుకున్న అంచనాల్ని మీరు అందుకోగలగాలి. సంస్థ అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేస్తున్నట్టయితే శాలరీ పెంచమని అడగడంలో తప్పు లేదు.
కొలీగ్స్‌కు జీతం పెరిగింది కాబట్టి మాకూ పెంచాలి అనే ధోరణిలో ఉంటారు చాలామంది ఉద్యోగులు. అయితే అలా తోటివాళ్లతో పోల్చుకుని నిరాశ చెందడం కంటే వాళ్లలా మీకు జీతం పెరగకపోవడానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తొందరపడకుండా మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు ట్రై చేయాలి.
జీతం పెంచమని అడగడానికి ఓ పద్ధతి ఉంటుంది. ఇతరులకు జీతం పెంచారు.. మాకు పెంచలేదన్న కోపాన్ని ప్రదర్శించకుండా తెలివిగా అడగాలి. సంస్థ కోసం మీరు చేసిన ప్రాజెక్టుల వివరాలు లాంటివి పైఅధికారులకు సమర్పించి శాలరీ హైక్ లేదా ప్రమోషన్ గురించి చర్చించాలి.
కుటుంబాన్ని పోషించడానికి జీతం సరిపోట్లేదని, జీతం పెంచమని కొంతమంది పైఅధికారులను అడుగుతుంటారు. అయితే ఈ విషయాలను అధికారుల వద్ద ప్రస్తావించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ప్రొఫెషనల్ లైఫ్‌లోకి పర్సనల్ లైఫ్‌ను తీసుకొస్తే.. సంస్థకు మీపై నెగెటివ్ అభిప్రాయం ఏర్పడొచ్చు.
ఇకపోతే శాలరీ హైక్, ప్రమోషన్ లాంటివి అడిగేటప్పుడు సంస్థ నియమనిబంధనల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సంస్థ నిబంధనల ప్రకారం ఎన్నేళ్లకోసారి శాలరీ హైక్, పదోన్నతులు కల్పిస్తున్నారో తెలుసుకోవాలి.