Telugu Global
Business

మిలియనీర్స్ సేవింగ్ మంత్ర ఇదే..

ప్రపంచంలో చాలామంది మిలియనీర్స్, మల్టీ మిలియనీర్స్ ఉన్నారు. వాళ్లలో అందరూ పుట్టుకతో కోటీశ్వరులు కారు. చాలామంది జీరోతో మొదలైనవాళ్లే.

మిలియనీర్స్ సేవింగ్ మంత్ర ఇదే..
X

ప్రపంచంలో చాలామంది మిలియనీర్స్, మల్టీ మిలియనీర్స్ ఉన్నారు. వాళ్లలో అందరూ పుట్టుకతో కోటీశ్వరులు కారు. చాలామంది జీరోతో మొదలైన వాళ్లే. అందరిలాగే చిన్న ఉద్యోగంతోనో, చిన్న బిజినెస్‌తోనో కెరీర్ స్టార్ట్ చేస్తారు. మరి వాళ్లంతా మిలియనీర్స్ ఎలా అయ్యారంటే దానికి వాళ్లు పాటించిన సేవింగ్ ఫార్ములాలే కారణం. అసలు సేవింగ్ ఎలా ఉండాలి? డబ్బు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

మిలియనీర్స్‌గా మారిన వాళ్లందరికీ ఒకేరకమైన సేవింగ్ ప్లాన్స్ ఉన్నట్టు స్టడీలు చెప్తున్నాయి. సొంతగా ఎదిగిన మిలియనీర్స్ అందరూ వయసు యాభై దాటిన తర్వాతే మిలియనీర్స్ అయ్యారట. అయితే ఈ యాభై ఏళ్లు ఎంతో ప్లానింగ్‌తో సేవింగ్స్ చేశారు. అదెలాగంటే..

మిలియనీర్స్ అందరూ కెరీర్ స్టార్టింగ్‌లో.. పది నుంచి ఇరవై శాతం ఇన్‌కమ్ సేవ్ చేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో యావరేజ్ సేవింగ్ శాతం ఎనిమిది. అంటే వస్తున్న జీతం లేదా ఆదాయంలో 8 శాతం మాత్రమే ఆదా చేస్తున్నారు. కానీ, మిలియనీర్స్ అందరూ సుమారు ఇరవై శాతం ఆదా చేయాలని టార్గెట్ పెట్టుకుంటారు. ముఖ్యంగా మిలియనీర్స్.. వాళ్ల ఆదాయాన్ని ‘బకెట్ సిస్టం’లో ఆదా చేసేవాళ్లట. బకెట్ సిస్టం అంటే.. ఒక బకెట్ నిండిన తర్వాత మరో బకెట్ నింపినట్టుగా డబ్బుని కూడా ప్రియారిటీస్ ప్రకారం సేవింగ్ చేస్తూ పోవడం.

సరైన సేవింగ్ ప్లాన్ కోసం ఆదాయాన్ని నాలుగు విధాలుగా సేవ్ చేయాలి. అవే రిటైర్‌‌మెంట్ సేవింగ్స్, స్పెసిఫిక్ ఎక్స్‌పెన్సెస్, ఎమర్జెన్సీ ఎక్స్‌పెన్సెస్, సైక్లికల్ ఎక్స్‌పెన్సెస్ రిటైర్‌‌మెంట్ సేవింగ్స్ అంటే.. రిటైర్ అయ్యిన తర్వాత అవసరాల కోసం ఇప్పటి నుంచే కొంత డబ్బుని సేవ్ చేయడం. అంటే ఇల్లు, కారు లాంటి వాటికోసం.

స్పెసిఫిక్ ఎక్స్‌పెన్సెస్ అంటే.. లైఫ్‌లో ఇష్టమైన, అవసరమైన వాటికోసం కొంత డబ్బుని దాచడం. ఉదాహరణకు ట్రావెలింగ్, షాపింగ్ లాంటివి.

అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్ అంటే.. అనుకోకుండా వచ్చే అవసరాల కోసం ముందుగానే కొంత డబ్బుని సేవ్ చేయడం. ఉదాహరణకు హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి.

సైక్లికల్ ఎక్స్‌పెన్సెస్ అంటే.. ప్రతి ఏటా ఉండే, వచ్చే ఖర్చులు కోసం దాచిపెట్టడం. అంటే పన్నులు, బిల్లులు, బర్త్‌డేలు, యానివర్సరీల లాంటివి. ఇలాంటి సిస్టమాటిక్ సేవింగ్ ప్లాన్‌తో ఎవరైనా ఫైనాన్సియల్‌గా సక్సెస్ అవ్వొచ్చు.

ప్లానింగ్ ఇలా..

సేవింగ్స్ చేయాలనుకుంటే దానికి టైంతో పనిలేదు. వెంటనే మొదలు పెట్టాలి. ‘టైం ఈజ్ మనీ’ అన్న ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. అలా వెంటనే మొదలుపెట్టినప్పుడే అది అలవాటుగా మారుతుంది. పొదుపు అంటే ఖర్చుపై అదుపు. అంటే ఖర్చుల్ని అదుపులో ఉంచుకున్నప్పుడే పొదుపు సాధ్యం. సంపాదనలో 10 నుంచి 30 శాతం ఆదా చేసుకుంటే ఫ్యూచర్‌‌లో ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండకపోగా వయసుతో పాటే.. ఆస్తి కూడా పెరుగుతుంది.

పొదుపు కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌, రికరింగ్‌ డిపాజిట్స్ వంటివి బెస్ట్ ఆప్షన్స్. అలాగే సేవింగ్స్‌.. లాంగ్ టర్మ్‌ను దృష్టిలో పెట్టుకుని చేయాలి. కనీసం ఓ పదేళ్ల పాటు సేవింగ్స్ చేస్తే గానీ అనుకున్న రిజల్ట్ కనపడదు.

First Published:  30 Nov 2023 1:09 PM IST
Next Story