These SUV Cars Costly | ఆ 3 ఎస్‌యూవీ కార్ల ధరలు పిరం.. గ్రాండ్ విటారా టూ టాటా హారియర్.. ఇవీ డిటైల్స్
These SUV Cars Costly | కార్ల తయారీ కంపెనీలు కూడా కస్టమర్ల ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా విభిన్న డిజైన్లతో సరికొత్త మోడల్ కార్లు అందుబాటులోకి తెస్తున్నాయి.
కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియస్‌గా, కుటుంబ సభ్యులంతా వెళ్లడానికి వీలైన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ)లపై మనస్సు పారేసుకుంటున్నారు. కార్ల తయారీ కంపెనీలు కూడా కస్టమర్ల ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా విభిన్న డిజైన్లతో సరికొత్త మోడల్ కార్లు అందుబాటులోకి తెస్తున్నాయి. ఎప్పటికప్పుడు అత్యాధునిక ఫీచర్లు జోడిస్తుండటంతోపాటు ఇన్ పుట్ కాస్ట్ పెరిగి పోతుండటంతో వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో మారుతి సుజుకి మార్కెట్లో ఆవిష్కరించిన గ్రాండ్ విటారా మొదలు టాటా మోటార్స్ సఫారీ, హారియర్ కార్ల ధరలు పెంచేశాయి ఆయా కంపెనీలు. ఇన్‌పుట్ కాస్ట్‌కు అనుగుణంగా వివిధ మోడల్ కార్ల ధరలు పెరుగుతున్నాయని కార్ల తయారీ సంస్థలు ప్రకటిస్తున్నాయి.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara) కారు రూ.4,000. పెరిగింది. హైబ్రీడ్ ఎస్‌యూవీ కారు గ్రాండ్ విటారా రూ.18.29 లక్షల నుంచి ప్రారంభమై టాప్ హై ఎండ్ వేరియంట్ ధర రూ.19.79 లక్షలకు లభిస్తున్నది. గ్రాండ్ విటారాలో అక్యౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ (అవాస్) వంటి సేఫ్టీ ఫీచర్ జత చేస్తున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది మారుతి సుజుకి. ఇప్పటి వరకు మారుతి సుజుకి రెండు దఫాలు కార్ల ధరలు పెంచేసింది. తొలుత జనవరి 16న అన్ని కార్ల ధరలు 1.1 శాతం, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 0.8 శాతం పెంచేసినట్లు తెలిపింది.
టాటా సఫారీ, హారియర్‌లపై రూ.20 వేలు పెరుగుదల
వివిధ శ్రేణుల కార్ల ధరలు 0.6 శాతం పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ఇంతకుముందే ప్రకటకించింది. మోడల్ వారీగా పెరిగిన ధరలను ప్రకటిస్తున్నది టాటా మోటార్స్, టాటా సఫారీ, హారియర్ మోడల్ కార్లపై ఒకేసారి రూ.20 వేలు పెంచేసింది. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చేశాయి. జూలై 17కి ముందు బుక్ చేసుకున్న వారికి, ఈ నెలాఖరు వరకు డెలివరీ చేసే కార్లకు పాత ధరలే వర్తిస్తాయి.
టాటా సఫారీ, హారియర్ మోడల్ కార్లలో కొత్తగా రెడ్ డార్క్ ఎడిషన్ తెచ్చింది టాటా మోటార్స్. రెండు కార్లలోనూ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, అడాస్ టెక్నాలజీ ఫీచర్ తీసుకొస్తున్నది. రెండు కార్లలో 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 168 బీహెచ్పీ విద్యుత్, గరిష్టంగా 359 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సులతో అమర్చారు. రెండో దశ బీఎస్-6 ప్రకారం ఈ రెండు కార్లలో రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) పరికరం అమర్చారు.
సబ్ -4 ఎం ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌పై రూ.20 వేలు, టాటా టియాగో, టాటా టైగోర్ కార్లపై రూ.4000 చొప్పున ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. టాటా నెక్సన్ ఎక్స్ఎంఏ + (ఎస్) డీజిల్ వేరియంట్ కారుపై అదనంగా రూ.5000 ధర పెరిగింది.