జనవరి నుంచి రూల్స్ మారుతున్నాయి!
New Rules From 1st January 2023: వచ్చే ఏడాది జనవరి నుంచి కొన్ని బ్యాంక్ రూల్స్ , క్రెడిట్ కార్డ్ రూల్స్, కొన్ని ధరల్లో మార్పులు రాబోతున్నాయి. ఇవి జనవరి 1 నుంచే అమలు అవుతాయి.
వచ్చే ఏడాది జనవరి నుంచి కొన్ని బ్యాంక్ రూల్స్ , క్రెడిట్ కార్డ్ రూల్స్, కొన్ని ధరల్లో మార్పులు రాబోతున్నాయి. ఇవి జనవరి 1 నుంచే అమలు అవుతాయి. ఆ రూల్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బ్యాంక్ లాకర్ రూల్స్ మారబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం లాకర్ అగ్రిమెంట్ పేపర్లు అటు కస్టమర్ల దగ్గర, ఇటు బ్యాంక్ దగ్గర ఉంటాయి. బ్యాంక్‌లో ఎన్ని లాకర్లు ఖాళీగా ఉన్నాయి?, ఏయే లాకర్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి? అనే వివరాలు కూడా బ్యాంకులు కస్టమర్లకు తెలియజేయాల్సి ఉంటుంది.
దొంగిలించిన, పోగొట్టుకున్న మొబైల్స్‌ను దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం ఒక రిస్ట్రిక్షన్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. మనదేశంలో స్మార్ట్‌ఫోన్స్, ఫీచర్ ఫోన్స్ తయారుచేసే కంపెనీలన్నీ, ఆయా మొబైల్స్ అమ్మడానికంటే ముందే 'ఇండియన్ కౌంటర్‌ఫీటెడ్ డివైజ్ రిస్ట్రిక్షన్ పోర్టల్'లో రిజిస్టర్ చేయాలి. ఇది జనవరి 1 నుంచి అమలవుతుంది.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనవరి 31 వరకూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. హోమ్ లోన్స్‌పై ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా వడ్డీ రేటులో భారీగా తగ్గించి, ప్రాసెసింగ్ ఫీజ్ మినహాయించనుంది. ప్రస్తుతం 8.75 శాతంగా ఉన్న ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ.. ఆఫర్‌లో భాగంగా 25 బేసిస్ పాయింట్స్ తగ్గుతుంది.
జనవరి 1, 2023 నుంచి మనదేశంలో కార్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఆడీ, -బెంజ్, హోండా, మహీంద్రా వంటి కంపెనీలన్నీ తమ బ్రాండ్ కార్ల ధరల్ని పెంచబోతున్నట్టు ప్రకటించాయి.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కు జనవరి 6 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇకపై ఒక వోచర్ లేదా ఆఫర్‌ను మరో వోచర్, ఆఫర్‌తో కలిపే అవకాశం ఉండదు. అలాగే అమెజాన్‌లో ఎస్‌బీఐ కార్డుతో ట్రాన్సాక్షన్ చేస్తే వచ్చే రివార్డ్ పాయింట్స్‌ను కూడా ఎ బీఐ తగ్గించనుంది.