బడ్జెట్‌లో బెస్ట్ 5జీ ఫోన్స్ ఇవే..
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొన్ని స్పెషల్ సేల్స్ నడుస్తున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో భారీ డిస్కౌంట్లతో ఫెస్టివల్ సేల్ మొదలుకాబోతోంది.
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొన్ని స్పెషల్ సేల్స్ నడుస్తున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో భారీ డిస్కౌంట్లతో ఫెస్టివల్ సేల్ మొదలుకాబోతోంది. ఈ సేల్‌లో పలు 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉంది. 5జీ ఫోన్ కొనాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్. అందుకే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్స్‌పై ఓ లుక్కేద్దాం.
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ
సామ్‌సంగ్ బ్రాండ్‌లో బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్ ఇది. ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. కెమెరా పెర్ఫామెన్స్ బాగుంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ వాడారు. ప్రస్తుతం సామ్‌సంగ్ గెలాక్సీ ఏ52 ఎస్ 5జీ ఫోన్ ధర రూ.26,988గా ఉంది.
మోటో ఎడ్జ్30 5జీ
స్టాక్ ఆండ్రాయిడ్ యూఐను కోరుకునేవాళ్లకు మోటోరోలా ఫోన్స్ బెస్ట్ ఆప్షన్. ఈ యూఐలో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉండవు. మోటో ఎడ్జ్30 లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ చిప్‌సెట్ ఉపయోగించారు. ఇందులో 4020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ఈ ఫోన్ ధర రూ.24,999గా ఉండే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ
రూ.25 వేల ధరలోపు ఉన్న బెస్ట్ 5జీ ఫోన్స్‌లో ఇదొకటి. ఇందులో 90హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేటు కలిగిన 6.43-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. 4500 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ ఉంటుంది. 65వాట్స్ ఫాస్ట్ చార్జింజ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.23,900గా ఉంది.
రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ
రూ.25 వేల లోపు ఉన్న 5జీ ఫోన్లలో రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ ఒకటి. ఇందులో 6.67 అమోలెడ్ స్క్రీన్, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్5 డిస్ ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పని చేసే ఈ మొబైల్‌లో కెమెరా పెర్ఫామెన్స్ బాగుంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింజ్ సపోర్ట్ చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.20,990గా ఉంది.
రియల్‌మీ 9 ప్రో+ 5జీ
బడ్జెట్‌లో దొరికే బెస్ట్ 5జీ ఫోన్లలో రియల్‌మీ 9 ప్రో+ 5జీ ఒకటి. ఇందులో కెమెరా పెర్ఫామెన్స్ బాగుంటుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌ను వాడారు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.4 అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.22,999గా ఉంది.