Tesla Cars Price Cut | డ్రాగన్ ఎలక్ట్రిక్ కార్లు చౌక.. చైనాలో 2000 డాలర్లు ధర తగ్గించేసిన టెస్లా.. కారణమిదే..?!
Tesla Cars Price Cut | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కార్లకు.. చైనా ఎలక్ట్రిక్ కార్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో చైనాలో అన్ని రకాల కార్ల ధరలను సుమారు 2000 డాలర్ల మేరకు తగ్గించివేసింది టెస్లా.
Tesla Cars Price Cut | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కార్లకు.. చైనా ఎలక్ట్రిక్ కార్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో చైనాలో అన్ని రకాల కార్ల ధరలను సుమారు 2000 డాలర్ల మేరకు తగ్గించివేసింది టెస్లా. టెస్లా కార్ల ధరలతో పోలిస్తే చైనా ఈవీ కార్ల ధరలు చౌకగా ఉండటంతో అందరూ ఆ కార్ల వైపే మొగ్గుతున్నారు. దీంతో టెస్లా సీఈఓ ఎలన్‌మస్క్.. చైనాలో తమ కార్ల ధరలు తగ్గించారు. అమెరికాలో కార్ల ధరలు తగ్గించిన తర్వాత చైనాలో టెస్లా కార్ల ధరలు తగ్గించడం ఇదే మొదటిసారి. టెస్లా ఈవీ కార్లలో పాపులర్ మోడల్ మోడల్3 కారు ధర 14,000 చైనా యువాన్లు (1930 అమెరికా డాలర్లు) తగ్గించింది. ఆదివారం చైనాలో టెస్లా వెబ్‌సైట్ ప్రకారం చైనాలో టెస్లా మోడల్ 3 కారు ధర 2,31,900 చైనా యువాన్ల (32 వేల అమెరికా డాలర్లు) కు దిగి వచ్చింది.
అలాగే టెస్లా మోడల్ వై (Model Y) కారు ధర 2,49,900 యువాన్లు, రెగ్యులర్ వర్షన్ మోడల్ ఎస్ (Model S) కారు ధర 6,84,900 యువాన్లు, మోడల్ ఎస్ ప్లైడ్ (Model S Plaid) ధర 8,14,900 యువాన్లు పలుకుతుంది. రెగ్యులర్ మోడల్ ఎక్స్ (Model X) కారు ధర 8,24,900 యువాన్ల నుంచి 7,24,900 యువాన్లకు దిగి వస్తుంది. అమెరికాలో మోడల్ వై (Model Y), మోడల్ ఎక్స్ (Model X), మోడల్ ఎస్ (Model S) కార్ల ధరలు 2000 డాలర్లు తగ్గించింది. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ధరలు 8,000 నుంచి 12 వేల డాలర్లు తగ్గించేసింది.
2024 మార్చి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా కార్ల విక్రయాలు తగ్గాయి. టెస్లా కార్ల విక్రయాలు తగ్గడం నాలుగేండ్లలో ఇదే తొలిసారి. మళ్లీ కార్ల గిరాకీ పెంచుకోవడానికి టెస్లా యాజమాన్యం ధరలు తగ్గించినట్లు తెలుస్తున్నది. అధిక వడ్డీరేట్ల నేపథ్యంలో ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ చైనాకోసం చౌక ధర మోడల్స్ ఆవిష్కరిస్తోంది.
భారత్‌లో పర్యటించాల్సి ఉన్నా.. టెస్లా కంపెనీలో ముఖ్యమైన కార్యక్రమాల కోసం తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు ఎలన్‌మస్క్ ప్రకటించారు. మరోవైపు, పొదుపు చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిని 10 శాతానికి పైగా తగ్గించేస్తూ గత సోమవారం ఓ ప్రకటన చేశారు. రోబోట్యాక్సీలకు అనుకూలంగా అత్యంత చౌక ఎలక్ట్రిక్ కారు తయారు చేయాలన్న ప్రకటనను రద్దు చేస్తున్నట్లు టెస్లా ప్రకటించినట్లు ఈ నెల ఐదో తేదీన రాయిటర్స్ ఓ వార్తా కథనం ప్రచురించింది. కానీ, రాయిటర్స్ అబద్దాలు రాస్తున్నదని పేర్కొంటూ ఎలన్‌మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ధరల తగ్గింపు వల్ల పలుసార్లు టెస్లా షేర్లు పతనం అయ్యాయి. ఈ ఏడాదిలో టెస్లా షేర్ 40.8 శాతం నష్టపోయింది. ఎలన్‌మస్క్ కూడా టెస్లా కార్ల విక్రయాలను పెంచుకోవడానికి లాభాలు తగ్గించుకోవడానికి వెనుకాడటం లేదు.