Diwali Gift- Enfield Bikes | దీపావళి బోనస్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లు.. తమిళనాట టీ ఎస్టేట్ ఓనర్ ఔదార్యం..!
Diwali Gift- Enfield Bikes | మరో ఎనిమిది రోజుల్లో దీపావళి పండుగ రాబోతున్నది. ప్రతియేటా దీపావళి సందర్భంగా కార్పొరేట్ కంపెనీలు మొదలు ఐటీ సంస్థలు.. ఫైనాన్సియల్ సంస్థల యాజమాన్యాలు తమ సిబ్బందికి గిఫ్ట్‌లు, బోనస్‌లు ఇస్తుంటాయి.
Diwali Gift- Enfield Bikes | మరో ఎనిమిది రోజుల్లో దీపావళి పండుగ రాబోతున్నది. ప్రతియేటా దీపావళి సందర్భంగా కార్పొరేట్ కంపెనీలు మొదలు ఐటీ సంస్థలు.. ఫైనాన్సియల్ సంస్థల యాజమాన్యాలు తమ సిబ్బందికి గిఫ్ట్‌లు, బోనస్‌లు ఇస్తుంటాయి. పలు కంపెనీలు తమ సిబ్బంది సంబురాలు జరుపుకోవడానికి వారి కుటుంబాలకు దుస్తులు, గిఫ్ట్ ఓచర్లు, ఇన్సెంటివ్‌లు, స్వీట్‌లు ఇస్తుంటాయి. అయితే, తమిళనాట ఓ టీ ఎస్టేట్ యాజమాని ఔదార్యం ప్రదర్శించాడు తన సిబ్బందికి దీపావళి గిఫ్ట్‌లు ఇవ్వడంలో ఉదారత ప్రదర్శించడంతో వార్తల్లోకెక్కింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరి టీ ఎస్టేట్ యజమాని తన సిబ్బందికి దీపావళి బోనస్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లు పంపిణీ చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు.
సదరు టీ ఎస్టేట్ ఉద్యోగులు ఆయా బుల్లెట్ మోటారు సైకిళ్ల కీలతో సంబురాలు చేసుకుంటున్న దృశ్యాల వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 42 ఏండ్ల టీ ఎస్టేట్ ఓనర్ కూడా తమ సిబ్బందికి బుల్లెట్ తాళం చెవులు పంపిణీ చేశాక.. వారితో కలిసి జాలీగా ట్రిప్‌కు వెళ్లడంతోపాటు ఆడిపాడారు. తమకు చిరస్మరణీయమైన బహుమతి ఇచ్చినందుకు సిబ్బంది ఉబ్బితబ్బిబయ్యారు. తమ యజమానికి చేతులు జోడించి మరీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ తరహా గిఫ్ట్ వస్తుందని మేం ఏనాడు ఊహించలేదు. ఆయన (యజమాని) సిబ్బంది పనితీరు ఆధారంగా సుమారు 15 రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటారు సైకిళ్లు ఇస్తాడనుకున్నాం. మిగతా వాళ్లెవరూ అందుకోలేం అనుకున్నాం. కానీ మేం బుల్లెట్ మోటారు సైకిళ్లు అందుకున్నాం. మేం చేసిన టీం వర్క్‌కు సంతసించిన మా యాజమాని మమ్ముల్నీ దీవించారు అని ఓ ఉద్యోగి పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఇంతకుముందు హర్యానాలోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్ తన సిబ్బందికి దీపావళి బహుమతిగా టాటా పంచ్ కార్లు పంపిణీ చేశారు. మిట్స్‌కార్ట్ చైర్మన్ ఎంకే భాటియా.. ఒక హెల్పర్‌తోపాటు 12 మంది ఉద్యోగులకు టాటా పంచ్ కార్లు పంపిన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. తమ సిబ్బంది అంకిత భావం, కష్టపడే తత్త్వం తనను ఆకట్టుకుందన్నాడు ఎంకే భాటియా. అందుకే వారికి ప్రస్తుత దీపావళికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. చెడుపై మంచి విజయానికి, చీకటిపై వెలుగు గెలుపునకు గుర్తుగా దేశవ్యాప్తంగా భారతీయులు దీపావళి జరుపుకుంటారు.