ITR filing | వేతన జీవులకు రిలీఫ్.. ఐటీఆర్ ఫైలింగ్ కోసం 24x7 సేవలు.. ఇవీ హెల్ప్‌లైన్ సెంటర్లు.. !
ITR filing | గత ఆర్థిక సంవత్సరం 2022-23 (ప్రస్తుత అంచనా సంవత్సరం 2023-24) ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు మరో మూడు రోజుల సమయమే ఉంది.
ITR filing | గత ఆర్థిక సంవత్సరం 2022-23 (ప్రస్తుత అంచనా సంవత్సరం 2023-24) ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు మరో మూడు రోజుల సమయమే ఉంది. ఇప్పటికీ వేతన జీవులు గణనీయంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు. చివరి క్షణం వరకూ వేచి ఉండకుండా సాధ్యమైనంత త్వరగా ఐటీఆర్ దాఖలు చేయాలని పన్ను చెల్లింపుదారులను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కోరింది. ఈ నెల 31తో ఐటీఆర్ దాఖలు చేయడానికి తుది గడువు.
ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కల్పించేందుకు సీబీడీటీ కీలక నిర్ణయం తీసుకున్నది. 24x7 గంటలు వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండాలని నిర్ణయించింది. ఐటీఆర్ దాఖలు చేయడంలో సాంకేతిక సమస్యలు, సందేహాలు నివృత్తి చేయడానికి ఈ నెల 31 వరకు 24x7 గంటలు కాల్స్, లైవ్ చాట్స్, వెబెక్స్ సెషన్లు, సోషల్ మీడియా వేదికలపై ఆదాయం పన్ను విభాగం అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపింది.
`ఐటీఆర్ ఫైల్ చేయడానికి పన్ను చెల్లింపుదారులకు సాయం చేసేందుకు పన్ను చెల్లింపు, ఇతర అనుబంధ సర్వీసుల కోసం శని, ఆదివారాల్లో హెల్ప్ డెస్క్ 24x7 గంటల పాటు పని చేస్తుంది. ఫోన్ కాల్స్, లైవ్ చాట్స్, వెబెక్స్ సెషన్స్, సోషల్ మీడియా వేదికలపై సహకారం అందిస్తాం. ఈ నెల 31 వరకు మా సహకారం కొనసాగుతుంది` అని ఐటీ విభాగం అధికారి ట్వీట్ చేశారు.
ఐటీ అధికారులు సలహాలిచ్చే అంశాలివే..
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ-ఫైలింగ్, ఫామ్స్, ఇతర వాల్యూయాడెడ్ సర్వీసులు & సమాచారం, దిద్దుపాటు, రీఫండ్, ఇతర ఆదాయం పన్ను ప్రాసెసింగ్ సంబంధ ప్రశ్నలు
పన్ను చెల్లింపుదారులు తమ పాన్ కార్డు నంబర్, మొబైల్ నంబర్‌తో orm@cpc.incometax.gov.in అనే ఈ-మెయిల్‌కు మెయిల్ చేసినా... సందేహాల నివృత్తి.
సందేహాలు నివృత్తి చేసేందుకు హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..
1800 103 0025
1800 419 0025
+91-80-46122000
+91-80-61464700
ఏఐఎస్, టీఐఎస్, ఎస్ఎఫ్‌టీ ప్రాథమిక ప్రతిస్పందన, ఈ-క్యాంపెయిన్స్ లేదా ఈ-వెరిఫికేషన్ కోసం 1800 103 4215 నంబర్‌కు ఫోన్ చేయండి.
బెంగళూరులోని ఆదాయం పన్ను విభాగం సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్, ఈ-ఫైలింగ్ యూనిట్ సేవలు ఇలా
టాక్స్ అడిట్ రిపోర్ట్ (ఫామ్ 3సీఏ-3సీడీ, 3సీబీ-3సీడీ - TAR.helpdesk@incometax.gov.in
ఇన్‌కం టాక్స్ రిటర్న్ (ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-7 వరకు) - ITR.helpdesk@incometax.gov.in
ఈ-పే టాక్స్ సర్వీస్ - epay.helpdesk@incometax.gov.in
ఇతర అంశాలపై - efilingwebmanager@incometax.gov.in
ITR filing | గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో పన్ను చెల్లింపుదారుల రిలీఫ్ కోసం ఈ నెల 31 వరకు 24x7 గంటలు సేవలందిస్తామని సీబీడీటీ తెలిపింది.