Telugu Global
Business

SUV Car Sales | టాప్ ఎస్‌యూవీల నుంచి మారుతి ఔట్‌.. ఆ రెండు సంస్థ‌ల‌దే హ‌వా..!

SUV Car Sales | క‌రోనా త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియ‌స్‌గా, సేఫ్టీ ఫీచ‌ర్ల‌తో కూడిన స్పోర్ట్స్ యుటిలిటీ వెహిక‌ల్స్ (ఎస్‌యూవీ) పై క్రేజ్ పెంచుకుంటున్నారు. గ‌త నెల‌లో మొత్తం 1,01,686 ఎస్‌యూవీ కార్లు అమ్ముడ‌య్యాయి.

SUV Car Sales | టాప్ ఎస్‌యూవీల నుంచి మారుతి ఔట్‌.. ఆ రెండు సంస్థ‌ల‌దే హ‌వా..!
X

SUV Car Sales | టాప్ ఎస్‌యూవీల నుంచి మారుతి ఔట్‌.. ఆ రెండు సంస్థ‌ల‌దే హ‌వా..!

SUV Car Sales | క‌రోనా త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియ‌స్‌గా, సేఫ్టీ ఫీచ‌ర్ల‌తో కూడిన స్పోర్ట్స్ యుటిలిటీ వెహిక‌ల్స్ (ఎస్‌యూవీ) పై క్రేజ్ పెంచుకుంటున్నారు. గ‌త నెల‌లో మొత్తం 1,01,686 ఎస్‌యూవీ కార్లు అమ్ముడ‌య్యాయి. మొత్తం కార్ల సేల్స్‌లో ఎస్‌యూవీల వాటా 43.56 శాతం అని తెలుస్తున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంట్రీ లెవ‌ల్ మొద‌లు టాప్ వేరియంట్ల వ‌ర‌కు ముందు వ‌రుస‌లో నిలిచే మారుతి సుజుకి గ‌త నెల సేల్స్‌లో వెనుక‌బ‌డింది. మొత్తం కార్ల విక్ర‌యాల్లో ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ హ్యుండాయ్ క్రెటా సేల్స్ 4.76 శాతం పెంచుకున్న‌ది. 2022తో పోలిస్తే గ‌త నెల‌లో 14,447 కార్లు విక్ర‌యించింది. గ‌తేడాది జూన్‌లో 13,790 కార్లు మాత్ర‌మే విక్ర‌యించింది. ఎస్‌యూవీల సేల్స్‌లో క్రెటా వాటా 14.21 శాతంగా ఉంది.

హ్యుండాయ్ క్రెటా త‌ర్వాతీ స్థానంలో ఉన్న టాటా నెక్సాన్ 13,827 కార్లు విక్ర‌యించింది. కానీ 2022తో పోలిస్తే 3.27 శాతం త‌గ్గింది. గ‌తేడాది 14,295 యూనిట్ల కార్లు అమ్ముడ‌య్యాయి. హ్యుండాయ్ వెన్యూ మూడ‌వ స్థానంలో, టాటా పంచ్ నాలుగో స్థానంలో నిలిచాయి. హ్యుండాయ్ వెన్యూ 11,606, టాటా పంచ్ 10,990 కార్లు అమ్ముడ‌య్యాయి, హ్యుండాయ్ వెన్యూ సేల్స్ 12.45 శాతం పెరిగితే, టాటా పంచ్ 5.53 శాతం కార్లు ఎక్కువ‌గా విక్ర‌యించింది.గ‌తేడాది జూన్‌లో టాటా పంః 10,414 యూనిట్లు మాత్ర‌మే అమ్మ‌గ‌లిగింది.

మారుతి సుజుకి బ్రెజా, గ్రాండ్ విటారా వ‌రుస‌గా ఐదు, ఆర‌వ స్థానాల్లో నిలిచాయి. మారుతి సుజుకి బ్రెజా గ‌రిష్టంగా వార్షిక ప్రాతిప‌దిక‌న 140,19 శాతం గ్రోత్ న‌మోదు చేసింది. గ‌తేడాది కేవ‌లం 4,404 బ్రెజా కార్లు అమ్ముడైతే, ఈ ఏడాది 10,578 యూనిట్ల‌కు చేరుకున్న‌ది. గ్రాండ్ విటారా 10,486 యూనిట్ల కార్ల సేల్స్ న‌మోద‌య్యాయి.

మ‌హీంద్రా స్కార్పియో -ఎన్ 2022తో పోలిస్తే 109.34 శాతం వృద్ధి రికార్డ‌యింది. 2022 జూన్‌లో కేవ‌లం 4,131 కార్లు అమ్ముడైతే, ఈ ఏడాది 8,648 యూనిట్ల కార్లు విక్ర‌యించింది. చివ‌రి మూడు స్థానాల్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్‌, కియా సొనెట్‌, మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్లు ఉన్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ 7,991, కియా సొనెట్ 7,722, మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 5391 యూనిట్లు అమ్ముడు పోయాయి. కియా సొనెట్ వార్షిక ప్రాతిప‌దిక‌న 3.58 శాతం, మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 10.48 శాతం సేల్స్ పెంచుకున్నాయి.

First Published:  9 July 2023 12:48 PM GMT
Next Story