Tata Harrier- Safari facelift | టాటా హారియర్-సఫారీ ఫేస్‌లిప్ట్ బుకింగ్స్ షురూ.. ఇవీ వేరియంట్స్.. ఫీచర్లు..!
Tata Harrier- Safari facelift | టాటా మోటార్స్ (Tata Motors) కొత్త ఆవిష్కరించిన ఆల్-న్యూ టాటా హారియర్ (Tata Harrier), టాటా సఫారీ (Tata Safari) కార్ల బుకింగ్స్ శుక్రవారం ప్రారంభించింది.
Tata Harrier- Safari facelift | టాటా మోటార్స్ (Tata Motors) కొత్త ఆవిష్కరించిన ఆల్-న్యూ టాటా హారియర్ (Tata Harrier), టాటా సఫారీ (Tata Safari) కార్ల బుకింగ్స్ శుక్రవారం ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు రూ.25 వేలు చెల్లించి టాటా హారియర్ ఫేస్ లిఫ్ట్ లేదా టాటా సఫారీ ఫేస్ లిఫ్ట్ ఎస్‌యూవీ కారు బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో టాటా మోటార్స్ వెబ్‌సైట్‌లో గానీ, టాటా మోటార్స్ డీలర్ల వద్ద గానీ ప్రీ-ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు.
ఇవీ స్పెషిఫికేషన్స్
టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ (Tata Harrier facelift) నాలుగు వేరియంట్లు - స్మార్ట్ (SMART), ప్యూర్(PURE), అడ్వెంచర్ (ADVENTURE), ఫియర్‌లెస్ (FEARLESS) వేరియంట్లలో ఆఫర్ చేస్తున్నది. టాటా మోటార్స్ తన ఎస్‌యూవీ సెగ్మెంట్ హారియర్ ఫేస్‌లిఫ్ట్ కారులో తొలిసారి అడాస్ (ADAS) విత్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (adaptive cruise control), సెవెన్ ఎయిర్‌బ్యాగ్స్ (seven airbags), ఈ-షిఫ్టర్, పెడల్ షిప్టర్స్, డ్యుయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ తదితర ఫీచర్లను తీసుకొస్తున్నది.
ఆల్‌న్యూ సఫారీ ఫేస్‌లిఫ్ట్ కూడా నాలుగు వేరియంట్లు - స్మార్ట్ (SMART), ప్యూర్(PURE), అడ్వెంచర్ (ADVENTURE), ఫియర్‌లెస్ (FEARLESS) వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది. బీఐ-లెడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, గెస్చర్ కంట్రోల్డ్ పవర్ టెయిల్ గేట్, 12.3 అంగుళాల హర్మాన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హర్మాన్ అడ్వాన్స్‌డ్ ఆడియో వోర్ ఎక్స్ విత్ 13 జేబీఎల్ మోడ్స్, 17 నుంచి 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లతో రూపుదిద్దుకున్నది. ఆల్ న్యూ హారియర్ ఫేస్‌లిఫ్ట్, ఆల్ న్యూ సఫారీ ఫేస్‌లిఫ్ట్ మోడల్స్‌లో #డార్క్ ఎడిషన్ (#DARK Edition) తీసుకొస్తున్నది.
హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ తదితర మోడల్ కార్లతో టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్, మూడు వరుసల ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 తదితర మోడల్ కార్లతో టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ పోటీ పడుతుంది. టాటా నెక్సాన్ 2023, నెక్సాన్.ఈవీల్లో మాదిరిగా ఆల్ న్యూ టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ 12.30 అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్‌లు ఉంటాయి.
టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్, టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ కార్లు 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో రూపుదిద్దుకున్నాయి. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో వస్తున్నాయి. ఈ ఇంజిన్ గరిష్టంగా 167.6 బీహెచ్‌పీ విద్యుత్, 350 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఎకో, సిటీ, స్పోర్ట్ మోడ్స్‌తోపాటు ట్రాక్షన్ మోడ్స్ - నార్మల్, రఫ్, వెట్ ఆప్షన్లలోనూ లభిస్తాయి.