Telugu Global
Business

జాగ్వార్ ప్లాట్‌ఫామ్‌పై ఈవీ కార్ల త‌యారీ.. ఇత‌ర కార్ల సంస్థ‌ల‌కు టాటా మోటార్స్ మాస్ట‌ర్ స్ట్రోక్‌..!

ఎల‌క్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో దూసుకెళ్తున్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం `టాటా మోటార్స్ (Tata Motors) ఇత‌ర కార్ల త‌యారీ సంస్థ‌ల‌కు మాస్ట‌ర్ స్ట్రోక్ ఇవ్వ‌బోతున్న‌ది. ప్యూర్ ఎల‌క్ట్రిక్ ప్లాట్‌ఫామ్ `ఎలక్ట్రిఫైడ్ మాడ్యుల‌ర్ ఆర్కిటెక్చ‌ర్ (Electrified Modular Architecture (EMA)`పై నూత‌న టాటా అవిన్యా (Tata Avinya) కాన్సెప్ట్‌తో ఎల‌క్ట్రిక్ కార్ల‌ను నిర్మించ‌నున్న‌ది.

జాగ్వార్ ప్లాట్‌ఫామ్‌పై ఈవీ కార్ల త‌యారీ.. ఇత‌ర కార్ల సంస్థ‌ల‌కు టాటా మోటార్స్ మాస్ట‌ర్ స్ట్రోక్‌..!
X

జాగ్వార్ ప్లాట్‌ఫామ్‌పై ఈవీ కార్ల త‌యారీ.. ఇత‌ర కార్ల సంస్థ‌ల‌కు టాటా మోటార్స్ మాస్ట‌ర్ స్ట్రోక్‌..!

ఎల‌క్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో దూసుకెళ్తున్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం `టాటా మోటార్స్ (Tata Motors) ఇత‌ర కార్ల త‌యారీ సంస్థ‌ల‌కు మాస్ట‌ర్ స్ట్రోక్ ఇవ్వ‌బోతున్న‌ది. ప్యూర్ ఎల‌క్ట్రిక్ ప్లాట్‌ఫామ్ `ఎలక్ట్రిఫైడ్ మాడ్యుల‌ర్ ఆర్కిటెక్చ‌ర్ (Electrified Modular Architecture (EMA)`పై నూత‌న టాటా అవిన్యా (Tata Avinya) కాన్సెప్ట్‌తో ఎల‌క్ట్రిక్ కార్ల‌ను నిర్మించ‌నున్న‌ది. ఇందుకోసం జాగ్వార్ లాండ్ రోవ‌ర్ (Jaguar Land Rover)తో భాగ‌స్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న‌ది. జేఎల్ఆర్ ఈఎంఏ ప్లాట్‌ఫామ్ ఆధారంగా అవిన్యా కాన్సెప్ట్‌తో న్యూ జ‌న‌రేష‌న్ హై ఎండ్ ఎల‌క్ట్రిక్ కార్లను త‌యారు చేయ‌నున్న‌ది. టాటా మోటార్స్ వారి టాటా ప్యాసింజ‌ర్ ఎల‌క్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎం)కు జాగ్వార్ లాండ్ రోవ‌ర్ (జేఎల్ఆర్‌) త‌న ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ టెక్నాల‌జీని షేర్ చేయ‌నున్న‌ది. దీనికి ప్ర‌తిగా టీపీఈఎం నుంచి రాయల్టీ ఫీజు తీసుకుంటుంది.


టాటా ప్యాసింజ‌ర్ ఎల‌క్ట్రిక్ మొబిలిటీ ఆధ్వ‌ర్యంలో వ‌చ్చే థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ ఈవీ కార్ల‌లో జేఎల్ఆర్ ఈఎంఏ ప్లాట్‌ఫామ్ టెక్నాల‌జీ వినియోగిస్తారు. ఈ టెక్నాల‌జీని ఆల్‌న్యూ ఎల‌క్ట్రిక్ మిడ్‌సైజ్డ్ ఎస్‌యూవీల త‌యారీకి వాడ‌తారు. టాటా మోటార్స్ 2025 నుంచి న్యూ ఈవీ కార్ల‌ను గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.


అడ్వాన్స్‌డ్ ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్ ఆర్కిటెక్చ‌ర్‌, క‌నెక్టివిటీ, ఫీచ‌ర్ ఓవ‌ర్ ది ఎయిర్ క్యాప‌బిలిటీతో గ‌రిష్ట ఇంటీరియ‌ర్ స్పేస్‌తో నిర్మించే టాటా ఈవీ కార్లు సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణించ‌డానికి వీలుగా ఉంటాయి. శ‌క్తిమంత‌మైన సామ‌ర్థ్యంతో కూడిన కార్లను క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులోకి తెచ్చేందుకు .. అత్యంత స‌మీకృత ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్ (సెల్ టూ ప్యాక్ బ్యాట‌రీ టెక్నాల‌జీ, బ్యాట‌రీ మేనేజ్మెంట్ అండ్ చార్జింగ్ సిస్ట‌మ్‌) అందిస్తుందీ ఎలక్ట్రిఫైడ్ మాడ్యుల‌ర్ ఆర్కిటెక్చ‌ర్ (Electrified Modular Architecture (EMA).


ఎల‌క్ట్రిఫైడ్ మాడ్యుల‌ర్ ఆర్కిటెక్చ‌ర్ (ఈఎంఏ)తో టాటా అవిన్యా సిరీస్ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ అత్యాధునిక అడాస్ ఫీచ‌ర్లు, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ చార్జింగ్ ఆప్ష‌న్లు కలిగి ఉంటాయి. సాఫ్ట్‌వేర్ ఓవ‌ర్ ది ఎయిర్ (సోటా), ఫీచ‌ర్స్ ఓవ‌ర్ ది ఎయిర్ (ఫోటా), సేఫ్టీ (యూరో ఎన్‌-క్యాప్ 5 స్టార్‌) అడాప్ష‌న్ వేగ‌వంతం చేస్తుందీ ఈఎంఏ. ప‌ర్స‌న‌ల్ మొబిలిటీలో సృజ‌నాత్మ‌క‌త‌కు అవిన్యా నూత‌న న‌మూనాగా నిలుస్తుంద‌ని టీపీఈఎం చీఫ్ ప్రొడ‌క్ట్ ఆఫీస‌ర్‌-హెచ్‌వీ ప్రోగ్రామ్స్ హెడ్ ఆనంద్ కుల‌క‌ర్ణి పేర్కొన్నారు. జేఎల్ఆర్ ఈఎంఏ ప్లాట్‌ఫామ్‌తో స‌హకార ఒప్పందం కుదిరినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. న్యూ ఏజ్ టెక్నాల‌జీ, సాఫ్ట్‌వేర్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ల్లో అత్యాధునిక టూల్స్‌తో సామ‌ర్థ్యంలోనూ, శ్రేణిలోనూ అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలు గ‌ల కొత్త ఈవీ కార్ల‌ను టాటా అవిన్యా ఆవిష్క‌రిస్తుంద‌న్నారు.

First Published:  4 Nov 2023 3:34 PM IST
Next Story