Tata Altroz | ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో కొత్తగా రెండు టాటా ఆల్ట్రోజ్ కార్లు.. అత్యంత చౌక.. ఆ మూడు కార్లతో సై అంటే సై..!
Tata Altroz | టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) రెండు కొత్త వేరియంట్లు 1.2 లీటర్ల రివొట్రోన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నాయి. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ గల ఈ కారు ఇంజిన్ గరిష్టంగా 88 పీఎస్ విద్యుత్, 115 ఎన్ఎం టార్చి వెలువరిస్తాయి.
Tata Altroz | టాటా మోటార్స్ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు ఆల్ట్రోజ్‌లో రెండు కొత్త వేరియంట్లను ఆవిష్కరించింది. ఎక్స్ఎం, ఎక్స్ఎం (ఎస్) పేర్లతో కార్ల ప్రేమికులకు అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌లలో టాటా ఆల్ట్రోజ్ అత్యంత అందుబాటు ధరలో లభిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలుస్తుంది. ఎక్స్ఎం వేరియంట్ ధర రూ.6.90 లక్షలు (ఎక్స్ షోరూమ్), ఎక్స్ఎం (ఎస్) వేరియంట్ ధర రూ.7.35 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా టాటా మోటార్స్ నిర్ణయించింది. మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాన్జా, హ్యుండాయ్ ఐ20 మోడల్ కార్లతో టాటా ఆల్ట్రోజ్ గట్టి పోటీ ఇస్తుంది.
టాటా ఆల్ట్రోజ్ రెండు కొత్త వేరియంట్లు 1.2 లీటర్ల రివొట్రోన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నాయి. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ గల ఈ కారు ఇంజిన్ గరిష్టంగా 88 పీఎస్ విద్యుత్, 115 ఎన్ఎం టార్చి వెలువరిస్తాయి.
స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్వీఎంస్‌తోపాటు 16 అంగుళాల వీల్స్ విత్ కవర్ వంటి ఫీచర్లతో న్యూ టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ఎం వస్తున్నది. ఎక్స్ఎం (ఎస్) వేరియంట్‌లో అదనంగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుంది. అంతే కాదు ఎక్స్ఎం, ఎక్స్ఎం (ఎస్) వేరియంట్లు.. ఎక్స్ఈ, ఎక్స్ఎం + వేరియంట్ల మధ్య శ్రేణిలో నిలుస్తాయి.
ప్రస్తుతం ఆల్ట్రోజ్ పెట్రోల్ (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వేరియంట్లన్నీ నాలుగు పవర్ విండోస్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రివర్స్ కెమెరా, రేర్ డీఫాగర్, ప్రీమియం లుకింగ్ డాష్‌బోర్డ్ రేర్ పవర్ విండోస్ తదితర ఫీచర్లు జత కలిపారు. ఎక్స్ఎం, ఎక్స్ఎం (ఎస్) వేరియంట్లలో రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు కూడా జత చేశారు.