Telugu Global
Business

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

నష్టపోయిన బ్యాంకింగ్‌ షేర్లు

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
X

వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. బుధవారం ఉదయం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీలో సెన్సెక్స్‌ 81,568.39 పాయింట్ల వద్ద ప్రారంభమై కాసేపటికే నష్టాల్లోకి పడిపోయింది. ఒకానొక దశలో బలపడి 81,742.37 పాయింట్లకు చేరుకుంది. చివరికి 81,526.14 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 16 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 31.75 పాయింట్ల లాభంతో 24,641.80 పాయింట్ల వద్ద ముగిసింది. బుధవారం ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, అదానీ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్ర నష్టాలను చవి చూడగా, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌ టెల్‌, నెస్లే ఇండియా, ఏషియన్‌ పేయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతి సుజుకీ షేర్లు లాభాలు సొంతం చేసుకున్నాయి.

First Published:  11 Dec 2024 4:48 PM IST
Next Story