లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఊతమిచ్చిన బ్యాంకింగ్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఇంటర్నేషన్ల మార్కెట్ల నుంచి సానుకూలత, బ్యాంకింగ్ షేర్ల తోడ్పాటుతో ఒడిదుడుకులను అధిగమించి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ లాభలతో ట్రేడింగ్ ముగించాయి. గురువారం ఉదయం బీఎస్‌ఈ క్రితం ముగింపు 81,467.10 పాయింట్ల వద్ద ప్రారంభమై కొద్దిసేపటికే 81,832.66 పాయింట్లకు చేరింది. ఒకానొక దశలో 82 వేల మార్క్ దాటినా చివరికి 140.75 పాయింట్ల లాభంతో 81,607.55 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 16.50 పాయింట్లు లాభపడి 24,998.45 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.83.97లుగా ఉంది. కోటక్ మహీంద్ర, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ , పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభపడగా, టెక్ మహీంద్ర, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టైటాన్ షేర్లు నష్టపోయాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 77.71 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.