భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
మంగళవారం లాభపడిన భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్ , నిఫ్టీ 50
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. ఇటీవల భారీ నష్టాలతో కనిష్టాల వద్ద ఉన్న మార్కెట్లలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు లాభాల్లోకి జారుకున్నాయి. నేటి ట్రేడింగ్‌ను సెన్సెక్స్ 200 పాయిట్లకు పైగా లాభంతో.. నిఫ్టీ 23,500 పైగా ప్రారంభించాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 785 పాయింట్లు పెరిగి 78,124 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 235.60 పాయింట్లు పెరిగి రూ. 23,689 వద్ద కొనసాగుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.40 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.43 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,628.80 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
సెన్సెక్స్ 30 లో ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్,, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, రిలయన్స్, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, ఐటీసీ షేర్లు లాభాల్లోకి ట్రేడవుతున్నాయి. కోటక్ మహీంద్రా, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.