Telugu Global
Business

లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

చైనా, కెనడా, మెక్సికోలపై అమెరికా విధించిన టారిఫ్‌లు మంగళవారం అమల్లోకి రావడం, ప్రతిగా అమెరికా వస్తువులపై చైనా సుంకాలు పెంచడంతో వాల్‌స్ట్రీట్‌ సూచీలు కుదేలు

లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. క్రమంగా నష్టాలను చవిచూసిన మార్కెట్లు నేడు.. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోలుకు దిగడంతో లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ రాణిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో మొదట ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ మొదలుపెట్టిన మార్కెట్లు ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.20 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 70.80 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,919.80 డాలర్ల వద్ద కదలాడుతున్నది.

ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 497.65 పాయింట్లు పెరిగి 73487.58 వద్ద.. నిఫ్టీ 154.95 పాయింట్లు పెరిగి 22237.60 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, జొమాటో, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బజాన్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

First Published:  5 March 2025 10:07 AM IST
Next Story