Telugu Global
Business

ఇటలీలో ఓ రెస్టారెంట్‌...ఒక టేబుల్‌ రెండు సీట్లు

ప్రపంచంలో అతి చిన్న రెస్టారెంట్‌ ఇదే. చిన్న రెస్టారెంట్‌ కదా అని ఆర్డినరీ రెస్టారెంట్‌ కాదు సుమా. ఇటలీలో ఇది ఓ ప్రత్యేకం.

ఇటలీలో ఓ రెస్టారెంట్‌...ఒక టేబుల్‌ రెండు సీట్లు
X

ఇటలీలో ఓ రెస్టారెంట్‌...ఒక టేబుల్‌ రెండు సీట్లు

ఇద్దరు వ్యక్తులు... ఆ ఇద్దరు ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. రేపటి ప్రేమికులుగా మారనున్న నేటి స్నేహితులూ కావచ్చు. అదీ కాక పోతే కొడుకు బర్త్‌డే సందర్భంగా తల్లీ కూతుళ్లు లేదా తండ్రీకొడుకులిద్దరూ డిన్నర్‌కి రెస్టారెంట్‌కు వెళ్లవచ్చు. నగరంలో మంచి రెస్టారెంట్‌ ఏది, ఫుడ్‌ ఎక్కడ రుచిగా ఉంటుంది... వంటివన్నీ చూసుకుని వెళ్లిన తర్వాత ఆ రెస్టారెంట్‌లో విపరీతమైన రద్దీ ఉంటుంది. కొద్దిసేపు వెయిట్‌ చేయించి ‘పీక్‌ అవర్స్‌ కదా సర్‌’ అంటూ ఓ మూలనున్న రెండు కుర్చీల టేబుల్‌ చూపిస్తారు సిబ్బంది. అది వాష్‌రూమ్‌కెళ్లే దారి లేదా కిచెన్‌ దొరికిన కొద్దిపాటి జాగా అయి ఉంటుంది. అక్కడ కూర్చుంటే విచిత్రమైన వాసనలు భరించాలి, అలాగే వాష్‌రూమ్‌కెళ్లేవాళ్లు వాళ్ల ముందు నుంచే నడుస్తుంటారు. ‘డిన్నర్‌ అంటే ఇది కాదు. ఇంత పెద్ద ప్రపంచంలో నా కొడుకుతో కలిసి డిన్నర్‌ చేయడానికి నాకు మంచి ప్రదేశమే లేదా’ అనుకున్నాడు ఇటలీలో రెమో అనే వ్యక్తి. ఇద్దరు మనుషులు కూర్చుని ఆహ్లాదంగా గడిపే అనువైన ప్రదేశంగా ఓ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దాడు. దాని పేరే ‘సోలో పర్‌ డ్యూ

రాచమర్యాదలు

ప్రపంచంలో అతి చిన్న రెస్టారెంట్‌ ఇదే. చిన్న రెస్టారెంట్‌ కదా అని ఆర్డినరీ రెస్టారెంట్‌ కాదు సుమా. ఇటలీలో ఇది ఓ ప్రత్యేకం. ఇందులో భోజనం 500 డాలర్లు. కాకరపూలు వెలిగించి స్వాగతం పలుకుతారు. సువాసనలు వెదజల్లే క్యాండిల్స్‌ వెలిగిస్తారు. వెయిటర్‌ని పిలవడానికి వెండి గంట అందుబాటులో ఉంటుంది. అందంగా అలంకరించి రాజసం ఉట్టిపడే టేబుల్‌ మన కోసం సిద్ధంగా ఉంటుంది. ఇక భోజనం విషయానికి వస్తే మనదే ఎంపిక. మల్టీ కోర్స్‌ మెనూలో చేపలు, మాంసం, డెజర్ట్, వైన్‌తోపాటు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్, ఫ్లోరల్‌ డిజైన్‌ మోడల్స్‌ అన్నింటినీ మనమే ఎంపిక చేసుకోవచ్చు. హార్ట్‌ షేప్‌లో తయారు చేసిన డెజర్ట్‌ కేక్‌ మీద అతిథుల పేర్లు రాస్తారు. క్లయింట్, కస్టమర్‌ అనే పదాలు వినిపించవు. అతిథులుగా గౌరవిస్తారు.

ముందు వెళ్లరాదు... ఆలస్యం చేయరాదు

రకరకాల పామ్‌ ట్రీల మధ్య ప్రాచీన రోమన్‌ విల్లాలో ఒక చిన్న నిర్మాణంలో వెలిసిన ఈ రెస్టారెంట్‌కి డిమాండ్‌ కూడా ఎక్కువే. షరతులు కూడా గట్టిగానే ఉంటాయి. నెలల కొద్దీ అడ్వాన్స్‌ బుకింగ్‌ జరిగిపోయి ఉంటుంది.

ఒకసారి బుక్‌ చేసుకున్న వాళ్లు పది రోజుల ముందు మరోసారి కన్ఫర్మ్‌ చేయాల్సి ఉంటుంది. క్యాన్సిల్‌ చేసుకోదలుచుకున్నా అదే ఆఖరు. చివరి నిమిషంలో క్యాన్సిల్‌ అనడానికి వీల్లేదు. అలాగే మనకు ఇచ్చిన టైమ్‌ స్లాట్‌కంటే ముందు వెళ్లడానికి వీల్లేదు. స్వాగతం పలకడానికి, ఆదరించడానికి ఎవరూ ఉండరు. మన టైమ్‌ మొదలవడానికి ఓ అరగంట ముందు ఫోన్‌ చేసి వస్తున్న విషయాన్ని నిర్ధారించాలి. ఈ రెండు రెండు సీట్ల రెసార్టెంట్‌ని ఇదే స్టయిల్‌లో 33 ఏళ్లుగా నడిపిస్తున్నాడు మిస్టర్‌ రెమో.

First Published:  13 July 2023 7:32 PM IST
Next Story