Telugu Global
Business

ఫ్లాట్‌గా ప్రారంభమై తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీలు

అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలతో నష్టాల్లో దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ఫ్లాట్‌గా ప్రారంభమై తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీలు
X

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ప్లాట్ గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాల మధ్య మొదట ప్లాట్‌గా ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్‌ 496.34 పాయింట్లు తగ్గి 77,702.77 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ134.౧౫ పాయింట్లు కుంగి 23,573.75 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర రూ. 77.33 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు రూ. 2,661.30 వద్ద ట్రేడవుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.82 వద్ద కొనసాగుతున్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో జొమాటో, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఎన్టీపీసీ, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నికరంగా రూ.1,491.౪౬ కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ఇటు దేశీయ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ. 1,615.28 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

First Published:  8 Jan 2025 11:59 AM IST
Next Story