ఎస్‌బీఐ కస్టమర్లకు అలెర్ట్! వాట్సాప్‌లోనే అన్ని సర్వీసులు!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం కొత్తగా వాట్సాప్ సర్వీసులను తీసుకొచ్చింది. పర్సనల్ బ్యాంకింగ్‌ను మరింత ఈజీ చేసేందుకు వీటిని తీసుకొచ్చినట్టు ప్రకటించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం కొత్తగా వాట్సాప్ సర్వీసులను తీసుకొచ్చింది. పర్సనల్ బ్యాంకింగ్‌ను మరింత ఈజీ చేసేందుకు వీటిని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. ఇకపై ప్రతి చిన్న పనికి బ్రాంచి వరకూ వెళ్లాల్సిన పనిలేకుండా వాట్సాప్ ద్వారానే అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, పెన్షన్ స్లిప్, లోన్.. ఇలా ఎన్నోరకాల సేవలను పొందొచ్చు.
ఎస్‌బీఐ వాట్సాప్ సర్వీసుల కోసం ముందుగా మొబైల్‌తో రిజిస్టర్ అవ్వాలి. దానికోసం ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన నెంబర్ నుంచి ‘WAREG’ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ టైప్ చేసి దాన్ని ‘7208933148’ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన వెంటనే అకౌంట్‌కు లింక్ అయిన నెంబర్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత నుంచి వాట్సాప్ ద్వారా ఎస్‌బీఐ సేవలు పొందొచ్చు.
ఎస్‌బీఐ వాట్సాప్ సర్వీసుల కోసం ముందుగా ‘9022690226’ నెంబర్‌ను కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత చాట్ బాక్స్‌లోకి వెళ్లి ‘Hi’ అని మెసేజ్ చేస్తే.. వాట్సాప్ సర్వీసులు యాక్టివేట్ అవుతాయి.
వాట్సాప్ సర్వీసుల ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ సింపుల్‌గా తెలుసుకోవచ్చు. చివరి 10 ట్రాన్సాక్షన్ల వివరాలతో కూడిన మినీ స్టేట్‌మెంట్ పొందొచ్చు. అలాగే చివరి 250 లావాదేవీలను అకౌంట్ స్టేట్‌మెంట్ రూపంలో పొందొచ్చు. హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ వంటి సేవలను కూడా వాట్సాప్ ద్వారానే పొందే వీలుంది.
వీటితోపాటు సేవింగ్ అకౌంట్ , రికరింగ్ డిపాజిట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్‌తో పాటు బ్యాంక్ అందించే అన్ని డిపాజిట్ల వివరాలు, వడ్డీ రేట్లు వాట్సాప్ ద్వారానే తెలుసుకోవచ్చు. వెహికల్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్.. ఇలా అన్ని లోన్స్‌కు సంబంధించిన వివరాలు, వడ్డీ రేట్లు వంటి వివరాలు కూడా పొందొచ్చు.
ఎస్‌బీఐ వాట్సాప్ సర్వీసుల ద్వారా 18 సంవత్సరాల వయసు నిండిన వారు వాట్సాప్ ద్వారానే ఇన్‌స్టా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా వాట్సాప్ సాయంతో ఎస్‌బీఐ సేవలు పొందొచ్చు. NRE, NRO అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు.
బ్యాంక్‌కు వెళ్లి తీసుకొనే డిపాజిట్, విత్‌డ్రా వంటి ఫారాలను కూడా పీడీఎఫ్ రూపంలో వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్ స్లిప్‌ల కోసం బ్యాంక్‌కు వెళ్లాల్సిన పనిలేదు. వాట్సాప్ ద్వారానే తీసుకోవచ్చు.
మీ అకౌంట్ పై ఉన్న ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్, కార్ లోన్, టూ వీలర్ లోన్ వివరాలు, డెబిట్ కార్డ్ లావాదేవీల హిస్టరీ, కార్డును బ్లాక్ చేయడం, కొత్త కార్డు రిక్వెస్ట్ వంటి సర్వీసులను కూడా వాట్సాప్ ద్వారానే పొందొచ్చు. వీటితోపాటు దగ్గర్లోని ఎస్‌బీఐ ఏటీఎంల వివరాలు, బ్యాంక్ హాలిడేస్ వివరాలు, బ్యాంకింగ్ హెల్ప్‌లైన్ నంబర్లు వంటివి కూడా వాట్సా్ప్ ద్వారానే తెలుసుకోవచ్చు.