డబ్బు దాచుకునేందుకు బెస్ట్ సేవింగ్ స్కీమ్స్!
డబ్బు సేవ్ చేసుకునేందుకు బ్యాంకుల నుంచి ప్రభుత్వ రంగ సంస్థల వరకూ చాలా రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.
చాలామంది సంపాదిస్తున్న డబ్బుని బ్యాంక్ అకౌంట్‌లో అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల ఎలాంటి నష్టం లేదు.. అలాగని లాభం కూడా లేదు. అందుకే డబ్బు దాచుకునేందుక సేవింగ్స్ స్కీమ్స్‌ను వాడుకోవాలి. వీటిలో కాస్త ఎక్కువ వడ్డీ రావడంతో పాటు లాంగ్ టర్మ్‌లో ఎక్కువ సేవ్ చేసుకునే వీలుంటుంది.
డబ్బు సేవ్ చేసుకునేందుకు బ్యాంకుల నుంచి ప్రభుత్వ రంగ సంస్థల వరకూ చాలా రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏయే స్కీమ్స్‌తో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నేషనల్ సేవింగ్స్ టైం డిపాజిట్
ఈ ప్రభుత్వ పథకంలో నచ్చిన టై పీరియడ్‌ను సెట్ చేసుకోవచ్చు. ఒక ఏడాది నుంచి ఐదేళ్ల పాటు సేవింగ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో వడ్డీ రేటు 6.7 శాతం వరకూ ఉంటుంది. రూ.1000 నుంచి పొదుపు చేసుకోవచ్చు. మ్యాగ్జిమం లిమిట్ లేదు.
పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్
పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్‌లో పొదుపు చేయడం ద్వారా 7.1 శాతం వడ్డీ పొందొచ్చు. ఈ స్కీమ్ కు టైం పీరియడ్ అంటూ ఏమి లేదు. ఎంత కాలమైనా సేవ్ చేసుకోవచ్చు. ఇందులో రూ. 500 నుంచి మ్యాగ్జిమం ఎంతైనా సేవింగ్ చేసుకోవచ్చు. ఇందులో పన్ను రాయితీలు కూడా ఉంటాయి.
నేషనల్ పెన్షన్ ప్లాన్
ఉద్యోగాలు చేసేవాళ్లకు ఈ స్కీమ్ మంచి ఆప్షన్. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రూపంలో డబ్బు పొందడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. నెలనెలా కొంత సేవ్ చేస్తుండడం ద్వారా రిటైర్ అయిన తర్వాత కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే మిగిలిన మొత్తాన్ని ప్రతినెలా పింఛనుగా కూడా పొందొచ్చు. ఇందులో కనీస డిపాజిట్ రూ.500. మ్యాగ్జిమం లిమిట్ లేదు. ఇందులో వడ్డీ 9 శాతం నుంచి 12 శాతం వరకూ ఉంటుంది.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌తో నెలనెలా ఆదాయాన్ని పొందొచ్చు. ఇదొక మంచి పెట్టుబడి పథకం. ఇందులో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. ఇండివిడ్యువల్ అకౌంట్ అయితే రూ.4.50 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షల వరకూ పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇందులో 6.60 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి నెలా వడ్డీని పొందే వీలుంటుంది. ఈ స్కీమ్ కు ఐదేళ్ల మినిమం లాక్‌ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఐదేళ్లపాటు తప్పక పెట్టుబడి పెట్టాలి.