ఒక్కరోజే రూపాయి భారీ పతనం
ఈ రోజు డాలర్ తో రూపాయి విలువ భారీగా పతనమైంది. గురువారం ఇంట్రాడే ట్రేడింగ్లో 90 పైసల నష్టంతో రూ.80.86 దగ్గర ముగిసింది. ఫిబ్రవరి 24 తర్వాత ఇదే అతిపెద్ద సింగిల్ డే పతనం.
డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో ఈ రోజు 79.9750 నుండి 80.86 కు పడిపోయింది. ధరలను కట్టడి చేయడానికి అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు 75 పాయింట్లు పెంచడంతో డాలర్ మీద రూపాయి మారకం విలువ దారుణంగా పతనమైంది.
గురువారం ఇంట్రాడే ట్రేడింగ్లో ఒక దశలో 1.24 శాతం నఫ్టపోయి రూపాయి విలువ 80.91లకు పడిపోయి చివరకు 90 పైసల నష్టంతో రూ.80.86 దగ్గర ముగిసింది. ఫిబ్రవరి 24 తర్వాత ఇదే అతిపెద్ద సింగిల్ డే పతనం.
అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచడం వల్ల భారత్ స్టాక్ మార్కెట్ నుంచి వీదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో రూపాయి విలువ మరింతగా క్షీణించే అవకాశం ఉంది. దీని వల్ల మనం విదేశాలనుంచి దిగుమతి చేసుకునే అనేక వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ముడి చమురు, బంగారం, వంట నూనెలు, పప్పు దినుసుల ధరలు ఆకాశన్నంటుతాయనే ఆందోళనలు రేగుతున్నాయి.
అయితే మనదేశం నుండి విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అయ్యే ఐటీ, ఫార్మా రంగాల ఉత్పత్తులకు లాభాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు.