జియో నుంచి కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్లివే
రియలన్స్.. తమ కొత్త జియో బుక్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. త్వరలోనే ఈ ల్యాప్‌టాప్ సేల్ మొదలవుతుంది. రిలయన్స్ డిజిటల్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా జియో బుక్ అందుబాటులోకి రానుంది.
తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే ల్యాప్‌టాప్‌ను తీసుకొస్తామని రిలయన్స్ జియో గతంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పిన విధంగా జియో తన లేటెస్ట్ ల్యాప్‌టాప్‌ను లాంఛ్ చేసింది. 'జియో బుక్' పేరుతో రాబోతున్న ఈ ల్యాప్‌టాప్ ఫీచర్ల వివరాలివే..
రియలన్స్.. తమ కొత్త జియో బుక్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. త్వరలోనే ఈ ల్యాప్‌టాప్ సేల్ మొదలవుతుంది. రిలయన్స్ డిజిటల్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా జియో బుక్ అందుబాటులోకి రానుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 1366×768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 11.6 ఇంచెస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది అడ్రినో 610 జీపీయూ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. జియో బుక్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు పని చేస్తుందని కంపెనీ చెప్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లో 4జీ సిమ్‌కు సపోర్ట్ చేస్తుంది. వీడియో కాలింగ్ కోసం 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 2 జీబీ ర్యామ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్ జియో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇక ఇందులో అన్నిరకాల కనెక్టివిటీ పోర్ట్‌లున్నాయి. యూఎస్‌బీ 2.0 పోర్ట్, యూఎస్ బీ3.0 పోర్ట్ తో పాటు హెచ్‌డీఎంఏ పోర్ట్ కూడా ఉంది. మెమరీ ఎక్స్‌ప్యాన్షన్ కోసం మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఉంది. బ్లూటూత్, వైఫై నెట్‌వర్క్స్ సపోర్ట్ చేస్తుంది. జియో బుక్ ప్రారంభం ధర రూ.15,799 ఉంటుంది.