Telugu Global
Business

Reliance demerger | రిల‌య‌న్స్ నుంచి డీమెర్జ‌ర్‌.. ఇదీ జియో ఫైనాన్సియ‌ల్స్ షేర్ విలువ!

Reliance demerger | బిలియ‌నీర్ ముకేశ్ అంబానీ సార‌ధ్యంలోని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌లో స‌రికొత్త అధ్యాయం మొద‌లైంది.

Reliance demerger | రిల‌య‌న్స్ నుంచి డీమెర్జ‌ర్‌.. ఇదీ జియో ఫైనాన్సియ‌ల్స్ షేర్ విలువ!
X

Reliance demerger | రిల‌య‌న్స్ నుంచి డీమెర్జ‌ర్‌.. ఇదీ జియో ఫైనాన్సియ‌ల్స్ షేర్ విలువ!

Reliance demerger | బిలియ‌నీర్ ముకేశ్ అంబానీ సార‌ధ్యంలోని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌లో స‌రికొత్త అధ్యాయం మొద‌లైంది. రిల‌య‌న్స్ (Reliance) నుంచి జియో ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్ఎస్ఎల్‌) విడి వ‌డింది. సరికొత్త‌గా ఏర్పాటైన జియో ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్ఎస్ఎల్‌) షేర్ విలువ రూ.261.85గా నిర్ణ‌యించింది. ఇది బ్రోక‌రేజీ సంస్థ‌లు అంచ‌నా వేసిన రూ.190 కంటే ఎక్కువ‌.

ఈ సంద‌ర్భంగా గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో ప్రీ-ఓపెన్ కాల్ వేలం నిర్వ‌హించారు. ప్రీ-ఓపెన్ కాల్ యాక్ష‌న్ సెష‌న్ సంద‌ర్భంగా నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో జియో ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ షేర్ విలువ రూ.261.85గా ఖ‌రారైంది. జియో ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ విడి వ‌డిన త‌ర్వాత రిల‌య‌న్స్ షేర్ రూ.2580కి ప‌డిపోయినా గురువారం ట్రేడింగ్‌లో రెండు శాతం పుంజుకున్న‌ది.

అంత‌కుముందు రిల‌య‌న్స్ స్ట్రాట‌ర్జిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (జియో ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ లిమిటెడ్‌) డీమెర్జ‌ర్ విలువ.. రిల‌య‌న్స్‌లో 4.68 శాతంగా ప్ర‌క‌టించింది. బుధ‌వారం బీఎస్ఈలో రిల‌య‌న్స్ షేర్ విలువ రూ.2840 ప్ర‌కారం జియో ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ విలువ రూ.133గా ఖ‌రారు చేసింది. గురువారం క‌స‌ర‌త్తు త‌ర్వాత‌ జేఎఫ్ఎస్ఎల్ షేర్ విలువ రూ.160-190 మ‌ధ్య ఉంటుంద‌న్న బ్రోక‌రేజీ అంచ‌నాల‌కు మించి రూ.261.85 వ‌ద్ద నిలిచింది. రిల‌య‌న్స్ నుంచి డీ మెర్జ‌ర్ త‌ర్వాత జేఎఫ్ఎస్ఎల్ మార్కెట్ షేర్లు 635.32 కోట్లు కాగా, దాని మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.1.66 ల‌క్ష‌ల కోట్లు.

అటు బీఎస్ఈ, అటు ఎన్ఎస్ఈల్లో గురువారం ఉద‌యం తొమ్మిది గంట‌ల నుంచి 9.45 గంట‌ల వ‌ర‌కు స్పెష‌ల్ ప్రీ-ఓపెన్ ట్రేడింగ్ సెష‌న్ నిర్వ‌హించారు. అటుపై జియో ఫైనాన్సియ‌ల్ సంస్థ విలువ ఖ‌రారు చేసి రిల‌య‌న్స్ నుంచి విడదీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు ఎన్ఎస్ఈలోని నిఫ్టీ-50 ఇండెక్స్ ట్రేడింగ్‌పై ఆంక్ష‌లు విధించారు.

First Published:  20 July 2023 3:56 PM IST
Next Story