ట్రంప్ టారిఫ్ చర్యలకు.. కెనడా, మెక్సికో, చైనా ప్రతిచర్యలు
అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 155 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రూడో వెల్లడి.

మెక్సికో, కెనడాల ఎగుమతులపై 25 శాతం సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కెనడా ప్రతీకార చర్యలకు దిగింది. ట్రూడో అగ్రరాజ్యంపై ప్రతికార సుంకాలు విధించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 155 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు.అందులో కొన్ని వస్తువులపై సుంకాలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని మరికొన్ని 21 రోజుల తర్వాత అమలవుతాయని స్పష్టం చేశారు. సుంకాలను అమెరికా ఉపసంహరించుకునేంత వరకు తమ టారిఫ్‌లు అలాగే ఉంటాయన్నారు. నాన్ టారిఫ్ చర్యలను కొనసాగించడానికి ప్రావిన్స్‌లతో చర్చలు జరుపుతున్నట్లు ట్రూడో చెప్పారు. అటు మెక్సికో ప్రధాని తమకు బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయని స్పష్టం చేశారు. తమ దిగుమతులపై సుంకాన్ని 20 శాతానికి పెంచడంపై చెనా స్పందించింది. ప్రతీకార చర్యలకు దిగుతామని హెచ్చరించింది. ఇప్పటికే ప్రణాళికలు ఉన్నాయని చైనా కామర్స్ మినిస్ట్రీ పేర్కొన్నది. అమెరికా ఉత్పత్తులపై చైనా కూడా ప్రతికార సుంకాలు విధించింది. ఆ దేశ ఉత్పత్తులపై 15 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమ, మక్కజొన్న, పత్తి వంటి ఉత్పత్తులపై చైనా సుంకాలు విధించింది.