Telugu Global
Business

ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే.. లాభమా? నష్టమా?

ఆదాయం బాగున్నవారికి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు క్రెడిట్ కార్డులను ఇస్తుంటాయి. ఇలా చాలామంది నాలుగైదు క్రెడిట్ కార్డులను వాడుతుంటారు. ఇలా మల్టిపుల్ కార్డులు వాడడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి.

ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే.. లాభమా? నష్టమా?
X

సాధారణంగా చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. కార్డుని బాగా మెయింటెయిన్ చేస్తున్నవాళ్లకు బ్యాంకులు ఆఫర్లతో కూడిన మరిన్ని క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తుంటాయి. అయితే ఒకటికి మించి క్రెడిట్ కార్డులుంటే మంచిదేనా? దీంతో ఉండే లాభాలేంటి? నష్టాలేంటి?

ఆదాయం బాగున్నవారికి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు క్రెడిట్ కార్డులను ఇస్తుంటాయి. ఇలా చాలామంది నాలుగైదు క్రెడిట్ కార్డులను వాడుతుంటారు. ఇలా మల్టిపుల్ కార్డులు వాడడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే..

ఎక్కువ కార్డులు వాడడం ద్వారా ఒక కార్డులో కొంత మొత్తాన్ని వాడుతూ యుటిలైజేషన్ రేషియో 50 శాతానికి దాటకుండా చూసుకోవచ్చు. దీనివల్ల క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. నాలుగైదు క్రెడిట్ కార్డులు వాడుతూ అన్నింటికి సరైన టైంలో రీపేమెంట్స్ చేస్తూ ఉండడం ద్వారా క్రెడిట్ స్కోర్ గణనీయంగా పెరుగుతుంది. ఫ్యూచర్‌‌లో హోమ్ లోన్ లేదా ఇతర లోన్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువ క్రెడిట్ కార్డులను మెయింటెయిన్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డుల లిమిట్ కూడా పెరుగుతుంది.

ఒక్కో క్రెడిట్ కార్డు కంపెనీకి ఒక్కోరకమైన ఆఫర్లు, రివార్డ్ పాయింట్లు ఉంటాయి. కాబట్టి మల్టిపుల్ క్రెడిట్ కార్డులు వాడడం ద్వారా ట్రావెల్, ఫ్లైట్స్, రూమ్స్, షాపింగ్ ఇలా.. రకరకాల అదనపు బెనిఫిట్స్‌ను పొందే వీలుంటుంది.

నష్టాలివే..

ఇక మల్టిపుల్ క్రెడిట్ కార్డుల వల్ల ఉన్న నష్టాల విషయానికొస్తే.. అవసరమైనప్పుడు లెక్కకు మించి ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. అన్ని కార్డులకు సరైన సమయంలో చెల్లింపులు చేయకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. అలాగే ఒక క్రెడిట్ కార్డు బిల్లుని మరో క్రెడిట్ కార్డు నుంచి తీసిన డబ్బుతో కట్టడం వంటిది అలవాటైతే.. ప్రతినెలా అదే పద్ధతి రొటేట్ అవుతుంది. అలా అప్పుల ఊబిలో చిక్కుకున్నట్టే.

మల్టిపుల్ క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్లు పిన్ నెంబర్లు గుర్తుంచుకోవడం, కార్డులను పోగొట్టుకోకుండా చూసుకోవడం ముఖ్యం. అలాగే అన్ని కార్డులకు సరైన సెక్యూరిటీ పెట్టుకోవాలి. వైర్‌‌లెస్ పేమెంట్స్ వంటివి ఆఫ్‌లో ఉంచుకోవాలి. ఎప్పుడు ఏ కార్డు నుంచి ఎంత మొత్తం కట్ అవుతుంది? ఎందుకు కట్ అవుతుంది? అనే వివరాలు గమనించుకోవాలి. ఎక్కువ కార్డులుంటే సైబర్ మోసాల బారిన పడే అవకాశం కూడా పెరగొచ్చు.

First Published:  10 Jan 2024 4:45 AM GMT
Next Story