చౌకైన ఎలక్ట్రిక్ కారు! ఫీచర్లివే..
PMV EaS-E cheapest Electric Car: ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ పీఎంవీ.. రీసెంట్‌గా చౌకైన ఎలక్ట్రిక్ మినీ కారుని రిలీజ్ చేసింది.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. ఎలక్ట్రిక్ బైక్‌లు, ఎలక్ట్రిక్ కార్లు వాడుతున్నవాళ్లు పెరుగుతున్నారు. అయితే మామూలు కార్లతో పోలిస్తే బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ కార్ల ధర ఎక్కువగా ఉంటుంది. అయితే తాజాగా దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు రిలీజ్ అయింది. దాని పూర్తి వివరాలివే..
ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ పీఎంవీ.. రీసెంట్‌గా చౌకైన ఎలక్ట్రిక్ మినీ కారుని రిలీజ్ చేసింది. 'పీఎంవీ ఈఏఎస్' పేరుతో విడుదలైన ఈ కారు ప్రీ-బుకింగ్‌లు ఇప్పటికే మొదలయ్యాయి. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రూ. 2,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.4.79 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారులో కిలోమీటర్ ప్రయాణం చేయడానికి కేవలం 75 పైసలు మాత్రమే ఖర్చవుతుందని సంస్థ చెప్తోంది.
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ కారులో 10 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. ఇది దాదాపు 20 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ కారు బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు 4 గంటల సమయం పడుతుంది.
కారు మోడల్‌ను బట్టి సింగిల్ ఛార్జ్‌కు 120, 160 లేదా 200 కిలో మీటర్ల వరకూ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. ఈ కారు 11 వేర్వేరు రంగుల్లో అందుబాటులో ఉంది. రీజెనరేటివ్ బ్రేకింగ్, రిమోట్ పార్కింగ్ అసిస్ట్, ఓటీఏ అప్‌డేట్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా కారులోని ఏసీ, హారన్, విండోస్, లైట్లను ఆపరేట్ చేయొచ్చు. అయితే చిన్నగా ఉండే ఈ మినీ కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించే వీలుంది.