Indus Appstore | గూగుల్‌కు పోటీగా స్వదేశీ ప్లే స్టోర్.. ఇండస్ యాప్ స్టోర్.. వెన్నుదన్నుగా ఫోన్‌పే.. ఎందుకిలా..?!
Indus Appstore | దేశీయంగా గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)కు ఆల్టర్నేటివ్‌గా ఇండస్ యాప్ స్టోర్ (Indus Appstore) వస్తోంది.
Indus Appstore | గూగుల్ అంటే సెర్చింజన్.. గ్లోబల్ టెక్ దిగ్గజంగా గూగుల్ ఎదురులేని సంస్థ. ప్రస్తుతం ప్రతిదీ టెక్నాలజీమయం కావడంతో అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లలో ఏ అవసరమైనా యాప్‌లపైనే ఆధార పడాల్సి వస్తోంది. ఆపిల్ ఐ-ఫోన్ మినహా ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా గూగుల్ ప్లేస్టోర్ (Google Play Store)లో యాప్స్ వాడుకోవాల్సిందే. కానీ దేశీయంగా గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)కు ఆల్టర్నేటివ్‌గా ఇండస్ యాప్ స్టోర్ (Indus Appstore) వస్తోంది. ఇండస్ యాప్‌స్టోర్‌కు దన్నుగా నిలుస్తోంది డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే (PhonePe). సదరు ఇండస్ యాప్ స్టోర్ (Indus Appstore)ను ప్రీ-ఇన్‌స్టాల్ చేసుకునేందుకు రెండు అతిపెద్ద స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలతో ఫోన్‌పే చర్చలు సానుకూలంగా ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఇండస్ యాప్ స్టోర్ (Indus Appstore) యాజమాన్యం.. 150 మిలియన్ల యూజర్లను చేర్చుకోవడమే లక్ష్యంగా సాగుతోందని సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.
నోకియా, లావా స్మార్ట్ ఫోన్ల సంస్థలతో ఇండస్ యాప్ స్టోర్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాల్లోకి ఎంటరయ్యాం. పలు ప్రధాన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలతోనూ చర్చలు సానుకూలంగా ఉన్నాయి. ఇది మేం మరింత ముందుకెళ్లడానికి ఉపకరిస్తుంది అని ఇండస్ యాప్ స్టోర్ కో-ఫౌండర్ ఆకాశ్ డోంగ్రే చెప్పారు. పారదర్శక విధానాలపై దృష్టి పెడుతూ, స్థానిక యూజర్ల మద్దతుతోపాటు డెవలపర్ ఎకో సిస్టమ్‌తోపాటు వివిధ స్మార్ట్ ఫోన్ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఈ ఏడాది చివరికల్లా 150 మిలియన్లకు పైగా యూజర్లకు చేర్చుకోవాలన్నది ఇండస్ యాప్ స్టోర్ లక్ష్యం అని ఆకాశ్ డోంగ్రే చెప్పారు.
ఇప్పటికే ఇండస్ యాప్ స్టోర్ రెండు మిలియన్ల డౌన్‌లోడ్స్ దాటింది. ద్వితీయ శ్రేణి నగరాల పరిధిలో ఇండస్ యాప్ స్టోర్‌కు ఆదరణ పెరుగుతోంది. తన యూజర్ల బేస్‌లో 45 శాతం ద్వితీయ శ్రేణి నగరాల వాసులే. ఫైనాన్స్, గేమ్స్, సోషల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్ తదితర పాపులర్ సెగ్మెంట్లలో మా ప్లాట్‌ఫామ్ 2.50 లక్షలకు పైగా యాప్స్ కలిగి ఉంది అని డోంగ్రే తెలిపారు.
రోజురోజుకు గూగుల్, యాప్ డెవలపర్ల మధ్య బిల్లింగ్ పాలసీ, కమిషన్ల విషయమై వివాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్‌పే సొంతంగా ఆండ్రాయిడ్ బేస్డ్ మొబైల్ యాప్ స్టోర్ ఈ ఏడాది ప్రారంభంలోనే ఆవిష్కరించింది. బ్లింకిట్, జెప్టో, మేక్‌మై ట్రిప్, పేటీఎంతోపాటు గేమింగ్ యాప్స్ డ్రీమ్11, నజారా టెక్నాలజీస్, ఏ23, ఎంపీఎల్, జంగిల్ రమ్మీ, తాజ్ రమ్మీ, రమ్మీ పాషన్, రమ్మీ కల్చర్, రమ్మీ టైం, కార్డ్ బాజీ వంటి యాప్స్ `ఇండస్ యాప్ ప్లే స్టోర్`లో ఆన్ బోర్డ్ యాప్స్‌గా ఉన్నాయి. యాప్ డెవలపర్లకు తొలి ఏడాది జీరో లిస్టింగ్ ఫీజు, ఇన్ యాప్ ట్రాన్సాక్షన్లపై జీరో ప్లాట్‌ఫామ్ ఫీజు ఆఫర్ చేస్తోంది ఇండస్ యాప్ స్టోర్.యాప్ డెవలపర్లు ఏదేనీ పేమెంట్ గేట్‌వేను ఎంచుకోవచ్చు. ఇండస్ యాప్ స్టోర్‌లో వాయిస్, రీజనల్ సెర్చ్ వంటి పీచర్లతో 12 భాషల్లో యాప్స్ ఉన్నాయి.
వీడియో లెడ్ డిస్కవరీతోపాటు కన్జూమర్ ఎంగేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ కల్పించే ఫీచర్ కూడా ఉంటుందన్నారు ఆకాశ్ డోంగ్రే. ఫోన్‌పే సాయంతో డెవలపర్ ఎకో సిస్టమ్ కోసం తమ ప్లాట్‌ఫామ్.. సింపుల్‌గా ఉండే సుస్థిర పేమెంట్ బిజినెస్ మోడల్ నిర్మిస్తాం అని చెప్పారు. అయితే గూగుల్ డిస్కవరీ సవాళ్ళను ఎదుర్కొన్నవెర్నాకులర్, టైర్-2 డెవలపర్లపై దృష్టి పెట్టాలని ఇండస్ యాప్ స్టోర్ నిర్వాహకులకు టెక్నాలజీ నిపుణులు సూచిస్తున్నారు.