Telugu Global
Business

ఆదాయం చాలట్లేదా? సెకండ్ ఇన్‌కమ్ కోసం ఇలా చేయొచ్చు!

ఇప్పుడున్న రోజుల్లో ఖర్చులు పెరగడమే కానీ, తగ్గడం అనేది లేదు. ఎంత తగ్గిద్దామనుకున్నా ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోలేని వాళ్లు చాలామందే ఉంటారు. ఇలాంటి వాళ్లంతా రెండో ఆదాయ మార్గం ఏదైనా ఉంటే బాగుంటుందని చూస్తుంటారు.

ఆదాయం చాలట్లేదా? సెకండ్ ఇన్‌కమ్ కోసం ఇలా చేయొచ్చు!
X

ఇప్పుడున్న రోజుల్లో ఖర్చులు పెరగడమే కానీ, తగ్గడం అనేది లేదు. ఎంత తగ్గిద్దామనుకున్నా ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోలేని వాళ్లు చాలామందే ఉంటారు. ఇలాంటి వాళ్లంతా రెండో ఆదాయ మార్గం ఏదైనా ఉంటే బాగుంటుందని చూస్తుంటారు. అలాంటి వాళ్లు ఈ ఆప్షన్లను ట్రై చేయొచ్చు.

తక్కువ జీతం పొందుతున్నవాళ్లు, ఫ్యామిలీలో తాము ఒక్కరే పనిచేస్తున్నవాళ్లకు నెలవారీ ఆదాయం సరిపోకపోవచ్చు. ఇలాంటి వాళ్లు రోజుకి కొంత సమయాన్ని కేటాయించడం లేదా నిర్థిష్టమైన పెట్టుబడులు పెట్టడం వంటి ఆప్షన్ల ద్వారా సెకండ్ ఇన్‌కమ్‌ను పొందొచ్చు. అదెలాగంటే..

రెంట్ ఇవ్వడం

మీకు ఇల్లు, కారు లేదా స్థలం వంటివి ఉంటే వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా సెకండ్ ఇన్‌కమ్ పొందొచ్చు. సొంత కారు ఉన్నవాళ్లు ఓలా, ఉబర్ లేదా ఏవైనా సంస్థల కింద కారుని అద్దెకు పెట్టడం ద్వారా నెలకు కొంతమొత్తాన్ని పొందే వీలుంటుంది. అలాగే ఉంటున్న ఇంట్లో గది ఖాళీగా ఉంటే రెంట్‌కు ఇవ్వొచ్చు.

డెలివరీ సర్వీసెస్

చిన్న ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి డెలివరీ సర్వీసులు, ఫుడ్ డెలివరీ సర్వీసుల్లో రోజుకి మూడు లేదా నాలుగు గంటలు పనిచేస్తూ కొంత అదనపు మొత్తాన్ని సంపాదించుకోవచ్చు.

అఫీలియేట్ మార్కెటింగ్

మీకు మంచి సోషల్ సర్కిల్ ఉన్నట్టయితే ప్రొడక్ట్స్‌ను సజెస్ట్ చేయడం ద్వారా కొంత మొత్తాన్ని సంపాదించుకోవచ్చు. ఉదాహరణకు వందమంది మెంబర్స్ ఉన్న వాట్సాప్ గ్రూప్‌కు మీరు అడ్మిన్ అయితే లేదా మీకంటూ సొంత సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంటే.. మీ యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ప్రొడక్ట్స్‌ను సజెస్ట్ చేయొచ్చు. మీరు ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా వాళ్లు ఆయా ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసినట్టయితే ఆఫీలియేట్ మార్కెటింగ్ కింద సంస్థలు కింద మీకు కొంత కమీషన్‌ను ప్రొవైడ్ చేస్తాయి. దీనీకోసం మీరు కొంత రీసెర్చ్ చేసి సరైన ప్రొడక్ట్స్‌ను సజెస్ట్ చేయాలి.

పార్ట్‌టైమ్ టీచింగ్

మీకు ఏదైనా సబ్జెక్ట్‌లో నాలెడ్జి ఉన్నట్లయితే వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో పార్ట్‌టైమ్ ట్యూటర్‌‌గా సబ్జెక్ట్స్ భోధించొచ్చు. ఇదొక మంచి సెకండ్ ఇన్‌కమ్ ప్లాన్. కొన్ని నెలలు సమయం వెచ్చించి మీకు నచ్చిన సబ్జెక్ట్‌ను నేర్చుకుని కుడా ఈ పని మొదలుపెట్టొచ్చు.

హాబీస్ ద్వారా

కొన్నిసార్లు మీకున్న హాబీస్ కూడా మీకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. మీకు కుట్లు, అల్లికలు లేదా క్రాఫ్ట్స్ తయారుచేయడం అలవాటైతే వాటిని మీషో వంటి ప్లాట్‌ఫామ్స్‌లో అమ్మకానికి పెట్టొచ్చు. కవితలు రాసే అలవాటు ఉంటే వాటిని ఒక చిన్న ఇ–బుక్‌గా రూపొందించి అమెజాన్ కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో అమ్మొచ్చు.

ఇకపోతే మీ సేవింగ్స్‌లో కొంత లేదా ఆదాయంలో కొంత మొత్తాన్ని సరైన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొంత కాలం తర్వాత నిర్థిష్టమైన మంత్లీ ఇన్‌కమ్ పొందేలా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఎంచుకోవచ్చు. వీటికై నిపుణుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.

First Published:  28 Dec 2023 11:01 AM GMT
Next Story