Telugu Global
Business

మంగళవారం లాభాల్లో మొదలైన సూచీలు

ప్రధాన షేర్లలో మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో సూచీలకు కలిసి వచ్చింది.

మంగళవారం లాభాల్లో మొదలైన సూచీలు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య సూచీలు పరుగులు పెట్టాయి. ప్రధాన షేర్లలో మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో సూచీలకు కలిసి వచ్చింది. దీంతో సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 380 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,600 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.71 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 71.27 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 3 వేల మార్క్‌ను దాటి ట్రేడవుతున్నది.

ఉదయం 10 గంటలకు సెన్సెక్స్‌ 575.88 పాయింట్ల లాభంతో 74745.83 వద్ద.. నిఫ్టీ 193.75 పాయింట్లు పెరిగి 22702.50 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, జొమాటో, ఎంఅండ్‌ ఎం, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషణ్‌, ఎల్‌అండ్‌ టీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

First Published:  18 March 2025 10:04 AM IST
Next Story