భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
మార్కెట్లపై 'ఫెడ్' దెబ్బ
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలయ్యాయి. మార్కెట్లపై ఫెడ్ దెబ్బపడింది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచడంతో సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం11 గంటల సమయానికి సెన్సెక్స్ 952.64 పాయింట్లు నష్టపోయి 79,229.౫౬ వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 254.౩౦ పాయింట్లు నష్టపోయి 23,944.55 వద్ద ట్రేడవుతున్నది. అమెరికా వడ్డీ రేట్ల ప్రకటనతో నష్టాలు పెరిగాయి. యూఎస్ ఫెడ్ ఎఫెక్ట్‌తో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేటు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.10 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,622 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.06 వద్ద కొనసాగుతున్నది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, బజాబ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌యూఎల్, ఐటీ, సన్‌ఫార్మా మాత్రమే లాభాలయలో ట్రేడవుతున్నాయి.
అంచనాలకు తగ్గట్లుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్, కీలక రేట్లలో కోత విధించింది. కీలక రేట్లను 25 బేసిక్ పాయింట్ల మేర తగ్గించింద. ఉద్యోగ, ద్రవ్యోల్బణ గణాంకాల్లో ప్రగతి నేపథ్యంలో వడ్డీరేట్లను ప్రస్తుత 4.50-4.75 శాతం నుంచి 4.25-4.50 శాతానికి పరిమితం చేస్తున్నట్లు ఫెడ్ ప్రకటించింది. అయితే భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు అంతలా ఉండకపోవచ్చని బలమైన సంకేతాలు ఇచ్చింది. దీంతో నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా మార్కెట్లు భారీగా క్షీణించాయి. డోజోన్స్్ 2.58 శాతం, ఎంఅండ్‌పీ 2.95 శాతం, నాస్‌డాక్ 3.56 శాతం చొప్పున నష్టపోయాయి.