Telugu Global
Business

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

మదుపర్లను ఆందోళనకు గురి చేస్తున్న అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల అంశాలు, డాలర్‌ విలువ పెరగడం

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు
X

స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్‌ 966.71 పాయింట్లు నష్టపోయి 80,323.25వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 294.45 పాయింట్లు నష్టపోయి 24,254.25 వద్ద ట్రేడవుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల అంశాలు, డాలర్‌ విలువ పెరగడం మదుపర్లను ఆందోళనకు గురి చేస్తున్నది. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నాయి. దీంతో స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాటలో నడుస్తున్నాయి.

కారణాలివే...

  • విదేశీ సంస్థాగత మదుపర్లు క్రమంగా రెండోరోజు మార్కెట్‌లో నుంచి నిధుల్ని వెనక్కి తీసుకుంటున్నారు. బుధవారం రూ. 1,102 కోట్లు, గురువారం రూ. 3,560 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. డాలర్‌ విలువ పెరగడంతో ఎఫ్‌ఐఐలకు అమ్మకాలు లాభదాయంగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  • అమెరికా ఎన్నికల అనంతరం డాలర్‌ విలువ క్రమంగా పుంజుకుంటున్నది. ఇది ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చనే ఆందోళన వినిపిస్తున్నది.రూపాయి విలువ క్షీణిస్తున్నది. గురువారం ఆల్‌టైమ్‌ కనిష్టాన్ని తాకింది. ఇది కూడా సూచీల పతనానికి ఓ కారణంగా భావిస్తున్నారు.
  • అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు ప్రారంభం నుంచి నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.41 శాతం, జపాన్‌ నిక్కీ 1 శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 1.28 శాతం, షాంగై 1.84 శాతం చొప్పున పతనమయ్యాయి.
  • బ్యాంకింగ్‌, మెటల్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను పడేశాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లలో లాభాల స్వీకరణకు మదపర్లు ఆసక్తి చూపడంతో సూచీలు డీలా పడ్డాయి.అలాగే చైనా ఉద్దీపన ప్రణాళికలపై అనిశ్చితి కూడా సూచీల పతనానికి మరో కారణంగా భిఇస్తున్నారు.
  • మరోవైపు నవంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.48 శాతానికి పరిమితమైంది. ఆర్‌బీఐ నియంత్రణ లక్ష్యం 6 శాతం లోపునకు ఇది దిగి వచ్చింది నవంబర్‌లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 9.04 శాతంగా నమోదైంది. అక్టోబర్‌లోని 10,87 శాతంతో పోలిస్తే తక్కువే అయినా, 2023 నవంబర్‌లో 8.7 శాతం కంటే ఎక్కువగా నమోదైంది.

First Published:  13 Dec 2024 11:44 AM IST
Next Story