Telugu Global
Business

Financial Tasks | టీసీఎస్ రూల్ టు కొత్త డెబిట్‌.. క్రెడిట్ కార్డు వ‌ర‌కూ.. అక్టోబ‌ర్ నుంచి మొద‌ల‌య్యే మార్పులివే..!

Financial Tasks | కాల‌గ‌ర్భంలో మ‌రో నెల క‌లిసిపోతున్న‌ది. ఆదివారం నుంచి 2023 అక్టోబ‌ర్ నెల ప్రారంభం కాబోతున్న‌ది. సెప్టెంబ‌ర్‌లో మాదిరిగానే అక్టోబ‌ర్‌లోనూ మీ పాకెట్‌లోని మ‌నీపై ప్ర‌భావం చూపే మార్పులు, ప‌లు ఫైనాన్సియ‌ల్ డెడ్‌లైన్‌లు ప్రారంభం కాబోతున్నాయి.

Financial Tasks | టీసీఎస్ రూల్ టు కొత్త డెబిట్‌.. క్రెడిట్ కార్డు వ‌ర‌కూ.. అక్టోబ‌ర్ నుంచి మొద‌ల‌య్యే మార్పులివే..!
X

Financial Tasks | టీసీఎస్ రూల్ టు కొత్త డెబిట్‌.. క్రెడిట్ కార్డు వ‌ర‌కూ.. అక్టోబ‌ర్ నుంచి మొద‌ల‌య్యే మార్పులివే..!

Financial Tasks | కాల‌గ‌ర్భంలో మ‌రో నెల క‌లిసిపోతున్న‌ది. ఆదివారం నుంచి 2023 అక్టోబ‌ర్ నెల ప్రారంభం కాబోతున్న‌ది. సెప్టెంబ‌ర్‌లో మాదిరిగానే అక్టోబ‌ర్‌లోనూ మీ పాకెట్‌లోని మ‌నీపై ప్ర‌భావం చూపే మార్పులు, ప‌లు ఫైనాన్సియ‌ల్ డెడ్‌లైన్‌లు ప్రారంభం కాబోతున్నాయి. న్యూ టీసీఎస్ (టాక్స్ క‌లెక్టెడ్ ఎట్ సోర్స్‌) రూల్‌, స్పెష‌ల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ డెడ్‌లైన్‌లు, నూత‌న డెబిట్ కార్డు త‌దిత‌ర ఏడు మార్పులు ప్రారంభం కాబోతున్నాయి. అవేమిటో ఓ లుక్కేద్దాం.. !

అక్టోబ‌ర్ ఒక‌టి నుంచి న్యూ టీసీఎస్ రూల్‌.. ఇలా

అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి న్యూ టాక్స్ క‌లెక్ష‌న్ ఎట్ సోర్స్ (టీసీఎస్‌) రేట్లు అమ‌ల్లోకి రానున్నాయి. విదేశాల్లో ప‌ర్య‌టించిన‌ప్పుడు నిర్ధిష్ట ప‌రిమితి దాటి ఖ‌ర్చు చేసినా, విదేశీ ఈక్విటీలు, మ్యూచువ‌ల్ ఫండ్స్‌, క్రిప్టో క‌రెన్సీల్లో పెట్టుబ‌డులు పెట్టినా, ఉన్న‌త విద్యాభ్యాసం కోసం విదేశాల‌కు వెళ్లినా ఈ నిబంధ‌న అమ‌ల్లోకి వ‌స్తుంది. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో విదేశాల్లో రూ.7 ల‌క్ష‌ల‌కు పైగా ఖ‌ర్చు చేస్తే 20 శాతం టీసీఎస్ మీ బ్యాంకు ఖాతా నుంచి డిడ‌క్ట్ అవుతుంది.

ఆర్బీఐ లిబ‌రలైజ్డ్ రెమిటెన్స్ సిస్ట‌మ్ (ఎల్ఆర్ఎస్‌) ప్ర‌కారం ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో విదేశాలకు 2.50 ల‌క్ష‌ల డాల‌ర్లు పంప‌వ‌చ్చు. 2023 అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో అన్ని ర‌కాల విదేశీ చెల్లింపులు రూ.7 ల‌క్ష‌లు దాటితే 20 శాతం టీసీఎస్ నిబంధ‌న అమ‌ల‌వుతుంది. మెడిక‌ల్‌, విద్యా ఖ‌ర్చుల‌కు మిన‌హాయింపు ఇచ్చారు.

న్యూ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ రూల్ ఇలా

డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డ్ కోసం మీకు ఇష్ట‌మైన నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్‌ను ఎంచుకునే ఆప్ష‌న్‌ను ఆర్బీఐ తీసుకొస్తున్న‌ది. మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్పుడు మీరు ఎంచుకున్న నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్ నుంచి కార్డులు జారీ అవుతుంది. 2023 అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి ఖాతాదారులు ఎంచుకున్న నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్ నుంచి బ్యాంకులు కార్డులు జారీ చేయాల‌ని ఆర్బీఐ ఆదేశిస్తుంది. బ‌హుముఖ కార్డుల నెట్‌వ‌ర్క్‌ల్లో మీకు ఇష్ట‌మైన నెట్‌వ‌ర్క్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఇండియ‌న్ బ్యాంక్ స్పెష‌ల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ గ‌డువు పొడిగింపు

కేంద్ర ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ ఇండియ‌న్ బ్యాంక్‌ త‌న ఖాతాదారుల కోసం ఎక్కువ వ‌డ్డీరేట్ల‌పై ఇండ్ సూప‌ర్ 400, ఇండ్ సుప్రీం 300 డేస్‌` స్పెష‌ల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప‌థ‌కాలు తీసుకొచ్చింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప‌థ‌కాల్లో చేరేందుకు 2023 అక్టోబ‌ర్ 31 వ‌ర‌కూ గ‌డువు పొడిగించింది.

ఎస్బీఐ వుయ్ కేర్ గ‌డువు ఇలా

సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం కేంద్ర ప్ర‌భుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ వుయ్ కేర్‌ అనే ప‌థ‌కం తీసుకొచ్చింది. సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు మాత్ర‌మే ఈ ప‌థ‌కంలో వారు పెట్టుబడి పెట్టేందుకు అనుమ‌తి ఇచ్చింది. అయితే, ఈ ప‌థ‌కం గ‌డువును ఎస్బీఐ పొడిగించే అవ‌కాశాలు ఉన్నాయి.

ఐడీబీఐ అమృత్ మ‌హోత్స‌వ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ గ‌డువు పొడిగింపు

ప్ర‌ముఖ బ్యాంక్‌.. ఐడీబీఐ.. ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా నూత‌న ఫిక్స్‌డ్ డిపాజిట్ ప‌థ‌కం అమృత్ మ‌హోత్స‌వ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ స్కీం తెచ్చింది. 375 రోజులు, 444 రోజుల గ‌డువుతో తీసుకొచ్చిన ఈ ప‌థ‌కం గ‌డువు 2023 అక్టోబ‌ర్ 31తో ముగుస్తుంది.

ఎల్ఐసీ పున‌రుద్ధ‌ర‌ణ క్యాంపెయిన్

స‌కాలంలో ప్రీమియం చెల్లించ‌క ఎక్స్‌పైర్ అయిన బీమా పాల‌సీల పున‌రుద్ధ‌ర‌ణ కోసం భార‌తీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్ర‌త్యేక క్యాంపెయిన్ చేప‌ట్టింది. 2023 సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీన ప్రారంభ‌మైన ఈ క్యాంపెయిన్ 2023 అక్టోబ‌ర్ 31 వ‌ర‌కూ కొన‌సాగుతుంది.

First Published:  29 Sept 2023 11:01 AM IST
Next Story